ఛాన్సే లేదంటోన్న స్టార్ హీరో!

బాలీవుడ్ లో షారుక్ ఖాన్ సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మూడు ద‌శాబ్ధాలుగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు.

Update: 2024-01-12 12:30 GMT

బాలీవుడ్ లో షారుక్ ఖాన్ సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మూడు ద‌శాబ్ధాలుగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. ఆయ‌న కెరీర్ చాలా సాధార‌ణంగా మొద‌లై నేడు సూప‌ర్ స్టార్ గా ఎదిగారు. దాని వెనుక ఎంతో క‌ష్టం..శ్ర‌మ ఉంద‌న్న‌ది తెలిసిందే. కెరీర్ ఆరంభంలో కొన్ని నెగిటివ్ రోల్స్ కూడా పోషించారు. అటుపై రొమాంటిక్ స్టోరీలు ఎంపిక చేసుకుని పెద్ద హీరో అయ్యాడు. మ‌రి మ‌ళ్లీ మీరు గ‌తంలోకి తొంగి చూడాల్సి వ‌స్తే? మ‌ళ్లీ నెగిటివ్ రోల్స్...విల‌న్ పాత్ర‌లు పోషించాల్సి వ‌స్తే? ఏం చేస్తారు? అనే ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు ఖాన్ సాబ్ ముందుకు వెళ్లాయి.

అందుకు ఆయ‌న ఇచ్చిన స‌మాధానం చూస్తే కింగ్ ఖాన్ మారిపోయాడు అనుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. ఎందుకంటే ఆయ‌న అలాంటి స‌మాధానం ఇచ్చాడు మ‌రి. `నేను ఆశాజ‌న‌కంగా..సంతోషంగా ఉండే క‌థ‌ల‌ను ఎక్కువ‌గా ఎంచుకుంటాను. నా సినిమాలో హీరో పాత్ర మంచి ప‌నులే చేస్తుంది. ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తుంది. నేను నెగిటివ్ పాత్ర పోషిస్తే దానికి హీరో చేతిలో చావు దెబ్బ‌లు త‌ప్ప‌వు.

ఎందుకంటే చెడుపై ఎప్ప‌టికైనా మంచే విజ‌యం సాధిస్తుంది` అని అన్నారు. షారుక్ ఖాన్ మాట‌ల్ని బ‌ట్టి ఆయ‌న కేవ‌లం హీరో పాత్ర‌లు త‌ప్ప ఇంకెలాంటి పాత్రలు పోషించ‌ర‌ని తెలుస్తోంది. అలాగే ఇత‌ర హీరోల చిత్రాల్లో కూడా పాజిటివ్ రోల్స్ తోనే గెస్ట్ గా మెప్పించనున్నార‌ని తెలుస్తోంది. బ‌ల‌మైన విల‌న్ పాత్ర‌గానీ...గెస్ట్ పాత్ర‌లో సైతం త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఉంటే త‌ప్ప పొషించ‌ర‌ని తెలుస్తోంది.

మొత్తంగా షారుక్ ఖాన్ త‌న‌ని తాను మ‌ళ్లీ నెగిటివ్ పాత్ర‌ల‌వైపు చూడాల‌నుకోవ‌డం లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతుంది. సాధార‌ణంగా న‌టుడు ఎలాంటి పాత్రైనా పోషించాలి అంటారు. కానీ స్టార్ హీరోల విష‌యంలో కొన్ని కండీష‌న్స్ అనేవి కూడా అప్లై అవుతుంటాయి. షారుక్ ఇక్క‌డ అదే అనుస‌రించాడు.

Tags:    

Similar News