కూతురితో షారుక్ సిల్వర్ స్క్రీన్ ప్లాన్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ జోయా అక్తర్ తెరకెక్కించిన 'ఆర్చీస్' మూవీతో తెరంగేట్రం చేస్తోంది.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ జోయా అక్తర్ తెరకెక్కించిన 'ఆర్చీస్' మూవీతో తెరంగేట్రం చేస్తోంది. థియేటర్స్ లో కాకుండా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీల్ డిసెంబర్ 7న విడుదల కానుంది. ఆర్చీస్ రిలీజ్ కి రెడీ అవుతుండగా ఓ యాక్షన్ మూవీలో తన తండ్రితో కలిసి బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వబోతోంది సుహానా. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కునున్న ఈ చిత్రానికి 'కింగ్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.
'వార్', 'పఠాన్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తుండగా, సుజోయ్ ఘోష్ డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. షారుక్ సొంత ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్ట్ ని సిద్ధార్థ ఆనంద్ మార్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి నిర్మిస్తోంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం..
ఈ సినిమాలోని యాక్షన్ ఫ్లేవర్ 'పఠాన్', 'జవాన్' సినిమాల్లో షారుక్ చేసిన దానికంటే మరింత భిన్నంగా ఉంటుందట. భారీ చేజింగ్ సీక్వెన్స్ లతో పాటూ ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇవన్నీ ఓ ఎమోషనల్ స్టోరీ తో లింక్ అయి ఉంటాయట. ఇక ఈ మూవీలో తండ్రి, కూతుళ్లు షారుక్, సుహానా కలిసి బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారనే విషయం తెలిసి ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ప్రస్తుతం సుహానా ఖాన్ తన అప్ కమింగ్ మూవీ 'ఆర్చీస్' ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ వచ్చే నెలలో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుహానా ఖాన్ తో పాటు జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ లెజెండ్ యాక్టర్ అమితాబచ్చన్ మనవడు అగస్త్య నందా ఆనంద ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక షారుక్ విషయానికొస్తే, ఈ ఏడాది పఠాన్, జవాన్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రెండు వేల కోట్లు కొల్లగొట్టి భారీ విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న షారుక్ డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.