టాలీవుడ్ లో సీనియర్ స్టార్.. బిజీబిజీగా..

ప్రస్తుతం తెలుగు సినిమా స్పాన్ పెరిగింది. టైర్ 1, టైర్ 2 హీరోలు పాన్ ఇండియా కథలపైనా దృష్టిపెడుతున్నారు.

Update: 2024-08-03 08:54 GMT

ప్రస్తుతం తెలుగు సినిమా స్పాన్ పెరిగింది. టైర్ 1, టైర్ 2 హీరోలు పాన్ ఇండియా కథలపైనా దృష్టిపెడుతున్నారు. తమ మార్కెట్ పరిధిని దేశ వ్యాప్తంగా విస్తరించుకోవాలని స్టార్ హీరోలు అనుకుంటున్నారు. అందుకే తమ సినిమాలు నాలుగు, ఐదు భాషలలో రిలీజ్ చేస్తున్నారు. సినిమాని ఇతర భాషలలో కూడా రిలీజ్ చేసేటపుడు అక్కడి మార్కెట్, పబ్లిక్ లోకి స్ట్రాంగ్ గా రీచ్ కావాలంటే ఆయా భాషలలో స్టార్ యాక్టర్స్ ని కూడా కీలక పాత్రల కోసం ఎంపిక చేసుకుంటే బాగుంటుంది.

కల్కి మూవీ హిందీలో సక్సెస్ కావడంలో ప్రభాస్ క్రేజ్ ఎంత ఉందో అంతకు రెట్టింపు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఉందని చెప్పాలి. బాలీవుడ్ స్టార్స్ అయిన సైఫ్ అలీఖాన్, సంజయ్ దత్, బాబీ డియోల్ సౌత్ సినిమాలలో కీలక పాత్రలలో కనిపించడానికి ముందుకొస్తున్నారు. అలాగే మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి మలయాళీ స్టార్స్ కి కూడా ఇతర భాషలలో ఆదరణ ఉంది. మంచి క్యారెక్టర్స్ వస్తే వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తెలుగులో ఇప్పుడు బిజీ కాబోతున్నాడని తెలుస్తోంది. కన్నడ స్టార్ యాక్టర్స్ ఇతర భాషలలో నటించింది చాలా తక్కువ. ఒక్క సుదీప్ మాత్రం ఇతర భాషలలో నటిస్తున్నాడు. అయితే శివరాజ్ కుమార్ మొదటిసారి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో కనిపించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు తెలుగులో అదిరిపోయే పాత్రలతో అలరించడానికి శివరాజ్ కుమార్ సిద్ధం అవుతున్నారు.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనున్న RC16 సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శివరాజ్ కుమార్ ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. RC16లో శివరాజ్ కుమార్ చేయబోతున్నాడనే విషయం రివీల్ కావడంతో మూవీకి కన్నడనాట కూడా హైప్ వచ్చింది. ఇప్పుడు తెలుగులో మరో సినిమాకి శివరాజ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మూవీ స్టార్ట్ కాబోతోంది.

మైత్రీ మూవీస్ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలో మూవీకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ ని మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం ఎంపిక చేసారంట. ఈయన కూడా మూవీ ప్రారంభోత్సవంలో పాల్గొనే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే టాలీవుడ్ లో సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బిజీ యాక్టర్ గా మారిపోవడం గ్యారెంటీ అనే టాక్ నడుస్తోంది.

Tags:    

Similar News