మరోసారి హీటెక్కించే అందంతో శ్రేయా పాప
తెలుగు సినిమా రంగంలో తొలి అడుగులు వేసినప్పటికీ, తన అసలు గుర్తింపు బాలీవుడ్లోనే తెచ్చుకున్న నటి శ్రేయా ధన్వంతరి.
తెలుగు సినిమా రంగంలో తొలి అడుగులు వేసినప్పటికీ, తన అసలు గుర్తింపు బాలీవుడ్లోనే తెచ్చుకున్న నటి శ్రేయా ధన్వంతరి. నాగ చైతన్య హీరోగా నటించిన ‘‘జోష్’’ చిత్రంలో చిన్న రోల్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత సందీప్ కిషన్ సరసన ‘‘స్నేహగీతం’’ సినిమాలో హీరోయిన్గా కనిపించింది. తెలుగు సినిమాల్లో ఎక్కువ అవకాశాలు లేక ముంబైకి వెళ్లి మోడలింగ్ కెరీర్ మొదలుపెట్టింది.
అక్కడ బాలీవుడ్ లో ‘‘వై చీట్ ఇండియా’’ చిత్రంతో నటిగా నిలదొక్కుకుని మంచి పేరు తెచ్చుకుంది. తన ప్రతిభతో పాటు గ్లామర్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తున్న శ్రేయా, ఇటీవల ‘‘ది ఫ్యామిలీ మెన్’’ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్ఫామ్లో పెద్ద హిట్టు కొట్టింది. అలాగే, ‘‘గన్స్ అండ్ గులాబ్స్’’ సిరీస్‌లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తరచూ తన ఫాలోవర్లను కొత్తగా ఆకట్టుకుంటున్న శ్రేయా, తన గ్లామరస్ ఫోటోషూట్లతో అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. తెల్లటి ట్యాంక్ టాప్‌లో తన అందాన్ని హైలెట్ చేస్తూ, కూల్ లుక్‌లో ఉన్న శ్రేయా ఈ ఫోటో ద్వారా తన టాటూను హైలైట్ చేసింది.
ఫోటోకు ‘‘వైట్ లైస్’’ అంటూ క్యాప్షన్ పెట్టి, ఫోటోషూట్ బృందాన్ని కూడా ట్యాగ్ చేసింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు, శ్రేయా అందచందాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకుముందు కూడా శ్రేయా ‘‘విమెన్ ఫిట్నెస్ ఇండియా’’ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అలాంటి మరెన్నో ఫోటోషూట్లతో తన ఫ్యాషన్ స్టేట్మెంట్ను క్రియేట్ చేస్తూ, అభిమానులను తనదైన స్టైల్లో ఆకట్టుకుంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మోడలింగ్ ఫోటోషూట్లు ఇలా అన్ని రంగాల్లో రాణిస్తూ, సోషల్ మీడియాలోనూ క్రేజ్‌ను మళ్లీ మళ్లీ పెంచుకుంటోంది.