లెహంగాలో శ్రేయా స్టన్నింగ్ గ్లామర్ డోస్!

నడుము అందాలతో పాటు, క్లీవేజ్ సొగలతో కుర్రాళ్ల మతులు పొగొట్టేలా ఉంది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Update: 2023-09-18 09:30 GMT

ఈ ఫోటోలో కనపడుతున్న అమ్మాయి పేరు శ్రేయా ధన్వంతరి . అచ్చమైన తెలుగు అమ్మాయి అనే విషయం మీకు తెలుసా. గొప్ప నటి కూడా. అదేంటి? ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలోనూ కనపడలేదే అనే సందేహం మీకు కలగొచ్చు. అయితే, మన తెలుగు అమ్మాయి అయినా, ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం బాలీవుడ్ లోనే. అందుకే అక్కడి వారికే ఎక్కువగా పరిచయం.


కాగా, సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి కంప్లీట్ గా మోడ్రన్ లుక్ లో కనిపించి ఊరిస్తుంది. మరోసారి కంప్లీట్ గా ట్రెడిషన్ వేర్ లోనూ దర్శనమిస్తుంది. అయితే, ఏ డ్రెస్ వేసినా, క్లీవేజ్ అందాలు మాత్రం చూపించకమానదు. తాజాగా మాత్రం లెహంగాలో మెరిసింది.


ఆరెంజ్ కలర్ లెహంగాలో మెరిసింది. కానీ, మోడ్రన్ డ్రెస్ లో కంటే ఎక్కువగా అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం. నడుము అందాలతో పాటు, క్లీవేజ్ సొగలతో కుర్రాళ్ల మతులు పొగొట్టేలా ఉంది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. చాలా అందంగా ఉన్నావ్ అంటూ ఆమెకు కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.

కాగా, హైదరాబాద్ నగరానికి ఈ చెందిన అ బ్యూటీ ఢిల్లీ పెరిగింది. వరంగల్ నీట్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది.శ్రేయాకి మొదటి నుంచి గ్లామర్ ఫీల్డ్ మీద ఆసక్తి ఎక్కువ. అందుకే, ఇంజినీరింగ్ చదువుతున్న సమయం నుంచే మోడలింగ్ పై ఫోకస్ పెట్టింది. ఆ సమయంలోనే ఆమె ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొంది. అప్పుడు రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత మిస్ ఇండియా 2008లో ఫైనలిస్ట్ గా ఫోటీ పడింది.

ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. తెలుగులో నాగచైతన్య మొదటి సినిమా జోష్ లో మెరిసింది. ఆ తర్వాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో జోష్ తో పాటు స్నేహ గీతం అనే మరో సినిమా కూడా చేసింది. ప్రముఖ వెబ్ సిరీస్ ఫ్యామీలీ మెన్ లోనూ ఓ కీలక రోల్ ప్లే చేసింది. ఆ తర్వాత కూడా ఆమె కొన్ని వెబ్ సిరీస్ లలో కీలక పాత్రలు పోషించింది.

Tags:    

Similar News