వినాయ‌కుడిపై తొలి సినిమా ఎప్పుడో తెలుసా?

గ‌ణ‌పతి ఉత్స‌వాలు మొద‌లైపోయాయి. వారం ప‌ది రోజుల పాటు ప్ర‌జ‌లంతా ఉత్స‌వాల్లోనే ఉంటారు.

Update: 2024-09-07 11:55 GMT

గ‌ణ‌పతి ఉత్స‌వాలు మొద‌లైపోయాయి. వారం ప‌ది రోజుల పాటు ప్ర‌జ‌లంతా ఉత్స‌వాల్లోనే ఉంటారు. గ‌ణ‌ప‌తి వ్ర‌తంతో వీధుల‌న్నీ మార్మోగుతుంటాయి. మ‌రి అలాంటి వేళ గ‌ణ‌ప‌తిపై వ‌చ్చిన తొలి సినిమా ఏది? సోష‌ల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతుంది. గ‌ణేష్ సినిమాల గురించి సెర్చ్ చేసే జ‌నాల సంఖ్య భారీగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఓసారి వివ‌రాల్లోకి వెళ్తే..

పూర్తి స్థాయిలో గ‌ణేష్ క‌థ‌ను చెబుతూ వ‌చ్చిన మొద‌టి సినిమా `శ్రీ వినాయ‌క విజ‌యం`. ఇది 1979 లో రిలీజ్ అయింది. ఇందులో కృష్ణంరాజు, వాణీ శ్రీలు శివ‌పార్వ‌తులుగా న‌టించారు. క‌మ‌లాక‌ర్ కామేశ్వ‌ర‌రావు ద‌ర్శక‌త్వంలో రూపొందింది. ఇందులో వినాయ‌కుడి జ‌న్మ వృత్తాంతంని ఎంతో గొప్ప‌గా ఆవిష్క‌రించారు. `ఎవ‌ర‌య్యా ఎవ‌ర‌య్యా` అంటూ సాగే గానం, దేవుల‌ప‌ల్లి ర‌చ‌న‌, సాలూరి స్వ‌రాలు, సుశీల‌మ్మ పాడిన పాట ఇప్ప‌టికీ పండ‌గ‌నాడు టీవీల్లో మార్మొగుతుంది.

అయితే వినాయ‌కుడి గెట‌ప్ లో ఉన్న ఆర్టిస్ట్ ఎవ‌రంటూ గూగుల్ లో సెర్చ్ మొద‌లైంది. అయితే ఈ సినిమా కంటే ముందు `వినాయ‌క చ‌వితి` అనే సినిమా 1959 లోనే రిలీజ్ అయింది. కానీ ఇందులో కేవ‌లం వినాయ‌కుడి వ్ర‌తం గురించి మాత్ర‌మే చూపించారు. ఆ ర‌కంగా వినాయ‌కుడిపై తొలి సినిమా అంటే ఇదే అవుతుంది. ఆ త‌ర్వాత విఘ్నేశ్వ‌రుడి పూర్తి క‌థ‌ని శ్రీ వినాయ‌క విజ‌యంలో ఆవిష్క‌రించారు.

అలా తొలి చిత్రంగా దీన్ని కూడా ప్రేక్ష‌కులు ప‌రిగ‌ణిస్తారు. ఈ సినిమా ఆరోజుల్లోనే మంచి విజ‌యం సాధించింది. ఇందులో బాల గ‌ణేషుడిగా న‌టించింది బేబి ల‌క్ష్మి సుధ‌. ఆ త‌ర్వాత ఏనుగు త‌ల గెట‌ప్ తో చిన్నారి అల‌రించింది. పెద్దాయ్యక వినాయ‌కుడి వేషం వేసింది ఎంజీవీ మ‌ద‌న గోపాల్ అనే ఆర్టిస్ట్. ఇత‌డి స‌మాచాం కోసం నెట్టింట నెటి జ‌న‌లు సెర్చ్ చేస్తున్నారు. కానీ ఎలాంటి ఆధార‌లు దొర‌క‌డం లేదు. దీంతో అత‌డి పేరిప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది.

Tags:    

Similar News