సిల్వ‌ర్ ఫ్రాకులో శ్రీ‌య‌ గుండె గుభేల్

సిల్వ‌ర్ బ్లౌజులో గుండె గుభేల్మ‌నిపిస్తోంది. వ‌రుస‌గా డిజైన‌ర్ గౌనుల్లో ఈ సీనియ‌ర్ న‌టి అంద‌చందాలు హృద‌యాల‌ను గెలుచుకుంటున్నాయి.

Update: 2024-07-17 04:50 GMT

సిల్వ‌ర్ బ్లౌజులో గుండె గుభేల్మ‌నిపిస్తోంది. వ‌రుస‌గా డిజైన‌ర్ గౌనుల్లో ఈ సీనియ‌ర్ న‌టి అంద‌చందాలు హృద‌యాల‌ను గెలుచుకుంటున్నాయి. ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే! అనే రేంజులో క‌నిపిస్తోంది ఈ బ్యూటీ. అయితే స‌ద‌రు బ్యూటీ వ‌య‌సు ఎంతో తెలిస్తే షాక్ తిన‌కుండా ఉండ‌లేరు. ఇంత‌కీ ఈ బ్యూటీ వ‌య‌సు ఎంత‌? అంటే.. అక్ష‌రాలా న‌ల‌భై ఒక‌టి. ఇంత లేట్ వ‌య‌సులోను శ్రీ‌య త‌న‌దైన అందం రూప‌లావ‌ణ్యంతో మ‌తులు చెడ‌గొడుతోంది.

 

ఈ వేష‌ధార‌ణ చూడ‌గానే అభిమానులు రెచ్చిపోతున్నారు. 41 వ‌య‌సులో ఉన్నా ఇంకా శ్రీ‌య‌లో టీనేజీ వైబ్స్ మిస్ కావ‌డం లేద‌ని కితాబిచ్చేస్తున్నారు. అంద‌మైన చిరున‌వ్వు.. చేప క‌ళ్ల‌తో గుండెల్ని గిల్లేస్తోందని కూడా అభిమానులు పొగిడేస్తున్నారు. తాజా ఫోటోషూట్ లో ర‌క‌ర‌కాల డిజైన‌ర్ గౌనుల్లో శ్రీ‌య ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.


2001లో సినీ అరంగేట్రం చేసినప్పటి నుండి సౌత్ - నార్త్ రెండు ప‌రిశ్ర‌మ‌ల్లోను సుప‌రిచితురాలిగా మారిన శ్రీ‌య విదేశీ క్రీడాకారుడు ఆండ్రీ కోశ్చీవ్‌ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. పెళ్లయి బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ ఈ రోజు కూడా తనపై ప్రశ్నార్థకమైన చూపుల తాకిడిని అనుభవిస్తున్నట్లు జాతీయ మీడియా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.


పరిశ్రమలోని మహిళా నటీనటులను పనికిమాలిన వ్యక్తులుగా భావిస్తారా? అనే ప్ర‌శ్న‌కు శ్రీ‌య స‌మాధానం ఇచ్చింది. `అన్ని సమయాల్లో` ఇలానే జరుగుతుందని శ్రీ‌య చెప్పింది. నాకు ఇలానే అనిపిస్తుంది. అందుకే నేను నా పాత స్నేహితులను ఇష్టపడుతాను.. తిరిగి వారితోనే నాణ్యమైన సమయాన్ని గడుపుతాను.. అని తెలిపింది. శ్రియా శరణ్ ప్రస్తుతం తన తదుపరి సిరీస్ `షోటైమ్` విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసుకున్న క‌థాంశం సినీప‌రిశ్ర‌మ నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించేదే. ఇక్క‌డ‌ అబద్ధాలు, మోసం, అధికారం, స్టార్‌డమ్ స‌హా చిత్ర పరిశ్రమలో తెరవెనుక వ్య‌వ‌హారాల‌పై తెర‌కెక్కిన వెబ్ సిరీస్ ఇది అని శ్రీ‌య తెలిపింది.


తాను డేటింగ్ వ్య‌వ‌హారాల గురించి నిజం ఎప్పుడూ చెప్ప‌లేద‌ని శ్రీ‌య అంది. ``నేను చాలా అబద్ధాలు చెప్పాను. నేను ఎవరితోనైనా డేటింగ్ చేస్తుంటే మీడియాతో `అతడు కేవలం స్నేహితుడు మాత్రమే` అని చెప్పాను. నేను డేటింగ్ చేస్తున్న ఎవరినీ ఎప్పుడూ అంగీకరించలేదు. నేనెప్పుడూ చూడను అని తెలిసినా కూడా సినిమా నాకు నచ్చిందని కూడా చెప్పిన సంద‌ర్భాలున్నాయి..అని తెలిపింది. ఇలాంటి అబ‌ద్ధాలు చాలా భయంకరమైనవి అని కూడా అంది. ఎప్పుడైనా నేను నాకు న‌చ్చింది చేస్తాను.. పరిశ్రమ ఎలా గ్రహిస్తుంది..? ఇత‌రులు మమ్మల్ని ఎలా చూస్తారు? అనేది వారి సమస్య.. మనది కాదు! అని కూడా శ్రీ‌య వ్యాఖ్యానించింది.


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో షో టైమ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మిహిర్ దేశాయ్ - సుమిత్ రాయ్ సంయుక్త‌గా దీనిని రూపొందించారు. మిహిర్ - అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ స‌మ‌ర్పించారు. ఇమ్రాన్ హష్మీ, రాజీవ్ ఖండేల్వాల్, మౌని రాయ్, నసీరుద్దీన్ షా, మ‌హిమా మక్వానా కూడా కీలక పాత్రల్లో నటించారు. ఇది మార్చి 8న ప్రీమియర్‌గా ప్రదర్శితం కానుంది.

Tags:    

Similar News