ప్రభాస్‌ హోం బ్యానర్‌లో ఆమెకి మళ్లీ ఛాన్స్‌

ప్రభాస్ నటించిన 'మిర్చి' సినిమాతో ప్రారంభం అయిన యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో చిన్నా పెద్ద సినిమాలు ఇప్పటి వరకు చాలానే ఉన్నాయి.

Update: 2024-07-05 11:30 GMT

ప్రభాస్ నటించిన 'మిర్చి' సినిమాతో ప్రారంభం అయిన యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో చిన్నా పెద్ద సినిమాలు ఇప్పటి వరకు చాలానే ఉన్నాయి. ఒక వైపు వందల కోట్ల బడ్జెట్‌ తో సినిమాలు నిర్మిస్తూ మరో వైపు పది నుంచి ఇరవై అంతకంటే తక్కువ బడ్జెట్‌ సినిమాలను యూవీ క్రియేషన్స్ వారు చేస్తున్న విషయం తెల్సిందే.

యూవీ క్రియేషన్స్ లో ఎక్కువగా ప్రభాస్ సినిమాలు, ఆయనకు సన్నిహితులు అయిన వారి సినిమాలు నిర్మాణం జరుగుతున్నాయి అనే టాక్ ఉంది. ప్రభాస్ తో సలార్ లో నటించిన శృతి హాసన్‌ తో యూవీ క్రియేషన్స్‌ వారు ఒక లేడీ ఓరియంటెడ్‌ సినిమాను ప్లాన్‌ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రభాస్ కు హోం బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్‌ లో ప్రస్తుతం తెలుగు మరియు తమిళ సినిమాల నిర్మాణం బ్యాక్ టు బ్యాక్ జరుగుతూనే ఉన్నాయి. కొత్త సినిమాల ప్రకటన కూడా బ్యాక్ టు బ్యాక్‌ వస్తూనే ఉన్నాయి. రాబోయే ఏడాది కాలంలో యూవీ క్రియేషన్స్ నుంచి పది సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సలార్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శృతి హాసన్‌ హిందీలో సినిమాలు, సిరీస్ లతో బిజీ బిజీగా ఉంది. ఈ సమయంలో తెలుగు లో ఈ అమ్మడితో ఒక లేడీ ఓరియంటెడ్‌ సినిమాను ప్లాన్‌ చేసిన యూవీ క్రియేషన్స్‌ వారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కొత్త దర్శకుడికి ఈ సినిమా బాధ్యతలను యూవీ క్రియేషన్స్ వారు అప్పగించారట. హర్రర్‌ కాన్సెప్ట్‌ తో హీరోయిన్ సెంట్రిక్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట.

Tags:    

Similar News

eac