శ్రుతిహాసన్ హృదయానికి తాళాలు..గొళ్లాలు వేసేసిందా?
అందులోనూ ప్రేమ అనే అంశంలో అమ్మడికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.
కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ వృత్తిగత జీవితం గురించి చెప్పాల్సిన పనిలేదు. నటన పరంగా కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతుంది. కోలీవుడ్..టాలీవుడ్..బాలీవుడ్ లో ఛాన్సులందుకుంటూ దూసుకు పోతుంది. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె అనుకున్నట్లు గా కెరీరీ ముందుకెళ్లడం లేదు. అందులోనూ ప్రేమ అనే అంశంలో అమ్మడికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. మొదటి లవ్ మైఖెల్ కోర్సేలేతో వ్యవహారం ఎంత దూరమొళ్లిందో తెలిసిందే.
స్నేహితుడిగా పరిచయమైన మైఖెల్ అటుపై ప్రియుడిగా మారాడు. ఇద్దరు కొన్నాళ్ల పాటు సహజీవనం చేసారు. కమల్ హాసన్ తో లంచ్ మీట్ లు..డిన్నర్ మీట్ లు సైతం ఎన్నో జరిగాయి. కానీ అది మూడు నాళ్లు ముచ్చటే అయింది. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోయారు. ఆ సమయంలో శ్రుతి హాసన్ మనసు ఎంతో కుమిలిపోయింది. తిరిగి కోలుకోవడనికి కొన్నాళ్లు సమయం తీసుకుంటుంది. అటుపై కొంత విరామం అనంతరం డూడల్ ఆర్టిస్ట్ శంతన్ హజారికాతో ప్రేమలో పడింది.
ఇటీవలే అతడితో కూడా బ్రేకప్ అయింది. ఇలా రెండు సార్లు లవ్ లో పడి ఫెయిలైన బ్యూటీ గా శ్రుతిహాసన్ పేరు మారుమ్రోగిపోతుంది. శంతనుతో బ్రేకప్ తర్వాత అమ్మడు సంచలన నిర్ణయయే తీసుకుందని ఆమె పోస్ట్ ని బట్టి తెలుస్తోంది. `ఔ షట్ ద డోర్.. అండ్ ఐ ఏట్ దట్ కీ ..ఐ వోంట్ బీ నీడింగ్ దట్ మీ ఎనీ మోర్` అంటూ ప్రేమలో విఫలమైనప్పుడు పాడుకునే పాటను జోడించింది. హృదయం తలుపులు మూసేసానని, ప్రేమ అనే తాళంతో దాన్ని మళ్లీ తెరవాలనుకోవడం లేదని ఆ పాట రూపంలో తన అభిప్రాయాన్ని పంచుకుంది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. శ్రుతి హాసన్ అంత సీరియస్ గా నిర్ణయం తీసుకుందంటే? శంతన్ విషయంలో కూడా బాగా డిస్టర్బ్ అయినట్లే కనిపిస్తుంది. వాస్తవానికి శంతను తో రిలేషన్ విషయంలో ఎంతో బ్యాలెన్స్ గా వెళ్తున్నట్లే కనిపించింది. తొలి బ్రేకప్ నేర్పిన అనుభవంతో శంతన్ తో అతిగా బాండింగ్ ని ఏర్పరుచుకోలేదని ప్రచారం సాగింది. కానీ శ్రుతి హాసన్ తీరు చూస్తుంటే? మరోసారి ప్రేమ విషయంలో గట్టి ఎదురు దెబ్బే తగిలినట్లు కనిపిస్తుంది.