స్టార్ హీరోయిన్ జోరు తగ్గడానికి రీజన్ ఏంటి..?

అటు కోలీవుడ్ లో కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోవట్లేదు శృతి హాసన్. కేవలం తెలుగులోనే కాదు అమ్మడికి తమిళ్ లో కూడా పెద్దగా లక్ కలిసి రావట్లేదు.

Update: 2024-08-07 01:30 GMT

సౌత్ స్టార్ హీరోయిన్ గా తన మార్క్ నటనతో ఆకట్టుకుంటూ వచ్చిన శృతి హాసన్ కెరీర్ మొదలైన టైం లో హిట్టు కోసం నానా తిప్పలు పడినా గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టి అప్పటి నుంచి కెరీర్ దూకుడు చూపించింది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొట్టిన శృతి హాసన్ మధ్యలో మళ్లీ తన నెగ్లిజెన్సీ వల్ల తెలుగు ఆఫర్లకు దూరమైంది. ఐతే తిరిగి మళ్లీ తెలుగు ఆఫర్లు అందుకుంటూ వచ్చిన శృతి హాసన్ సీనియర్ స్టార్స్ తో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా జత కట్టింది.

 

ఐతే అదే ఆమెకు శాపంగా మారిందా అని డౌట్ మొదలైంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాల్లో నటించిన అమ్మడు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నా కూడా అమ్మడికి అంత క్రేజ్ రాలేదు. ఐతే ఆ తర్వా నాని హాయ్ నాన్నలో స్పెషల్ సాంగ్ లో మెరిసిన శృతి హాసన్ నెక్స్ట్ సలార్ 1 లో ప్రభాస్ సరసన నటించింది.

ఆ సినిమాలో ప్రభాస్ తో కలిసి డ్యూయెట్స్ ఏమి చేయలేదు కానీ సలార్ 1 అమ్మడి ఖాతాలో పడటంతో జోరు అందుకుంటుందని అనుకున్నారు. కానీ సలార్ హిట్ కూడా శృతికి పెద్దగా కలిసి వచ్చినట్టు లేదన్నట్టు తెలుస్తుంది. సలార్ 2 లో ఆమె పాత్ర కొనసాగుతుంది. ఐతే సలార్ తర్వాత అడివి శేష్ తో డెకాయిట్ చేస్తున్న శృతి ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా అందుకోలేదు.

అటు కోలీవుడ్ లో కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోవట్లేదు శృతి హాసన్. కేవలం తెలుగులోనే కాదు అమ్మడికి తమిళ్ లో కూడా పెద్దగా లక్ కలిసి రావట్లేదు. ప్రస్తుతం రజిని కూలీలో ఛాన్స్ అందుకున్న శృతి హాసన్ ఆ సినిమాతో అయినా హిట్ ఫాం లోకి వస్తుందేమో చూడాలి. ఐతే సలార్ 2 ఎలాగు లైన్ లో ఉంది కాబట్టి అమ్మడు డౌట్ పడాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. మరి శృతి కెరీర్ మళ్లీ దూకుడు చూపించే పరిస్థితి ఎప్పుడు వస్తుందో చూడాలి. శృతి హాసన్ మాత్రం కెరీర్ ఎలా ఉన్నా సరే పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా ఉంటుంది.

Tags:    

Similar News