నటి శృతి భర్త మృతి.. 30 ఏళ్లకే హార్ట్ ఎటాక్
తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన శృతి షణ్ముగప్రియ గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే
తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన శృతి షణ్ముగప్రియ గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. సుదీర్ఘ కాలంగా అరవింద్ శేఖర్ తో ప్రేమలో ఉన్న శృతి పెద్దల అంగీకారంతో గత ఏడాది మేలో వివాహం చేసుకుంది.
శృతి, అరవింద్ వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని అంతా భావిస్తున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 30 ఏళ్ల వయసులోనే అరవింద్ శేఖర్ గుండె పోటుకు గురి అయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా కూడా ఫలితం దక్కలేదు.
బాడీ బిల్డర్ అయిన అరవింద్ శేఖర్ ఫిట్ నెస్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉండేవాడు. ప్రత్యేకమైన స్టూడియో ను ఏర్పాటు చేసి ఎంతో మందికి బరువు తగ్గేందుకు ట్రైనింగ్ ఇస్తూ ఉండే అరవింద్ శేఖర్ మృతి పట్ల ఆయన సన్నిహితులు ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
థియేటర్ ఆర్టిస్ట్ అయిన శృతి నాథస్వరం అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వాణి రాణి, కళ్యాణ పరిసు, పొన్నుంచల్ మరియు భారతి కన్నమ్మ ఇలా అనేక సీరియల్స్ లో నటించి తమిళ ప్రేక్షకుల అభిమానం దక్కించుకుంది. శృతి, అరవింద్ శేఖర్ దంపతులకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండేది. అరవింద్ మృతి పట్ల ఇండస్ట్రీ వర్గాల వారు సంతాపం తెలియజేస్తున్నారు.