పోసానిని గట్టిగానే తగులుకున్న శివాజీ... తన్నడానికి ఎంతసేపు?

ఈ సందర్భంగా... "కులాల గురించి మాట్లాడటం తప్పని, ఇకపై ఆ పని మానుకుని మీ పని మీరు చేసుకోవాలని" పోసానికి శివాజీ హితవు పలికారు.

Update: 2024-06-08 07:29 GMT

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించడం.. వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో.. రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇందులో భాగంగా నిన్నమొన్నటివరకూ మాట్లాడినవారంతా ఇప్పుడు మౌనందాల్చగా.. నిన్నటివరకూ విన్నవారు ఇప్పుడు మైకులందుకుంటున్నారు! ఈ క్రమంలో తాజాగా శివాజీ స్పందించారు. ఇందులో భాగంగా పోసానిపై విరుచుకుపడ్డారు.

అవును... వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరుపున బలంగా మాట్లాడిన గొంతుల్లో ఒకటైన ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై.. శివాజీ స్పందించారు. ఇందులో భాగంగా... ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి గురించి మాట్లాడే హక్కు తనకు లేదు కానీ... తన కులం గురించి మాట్లాడారు కాబట్టి స్పందిస్తున్నట్లు తెలిపారు!

ఈ సందర్భంగా... "కులాల గురించి మాట్లాడటం తప్పని, ఇకపై ఆ పని మానుకుని మీ పని మీరు చేసుకోవాలని" పోసానికి శివాజీ హితవు పలికారు. “ఎందుకంటే... మీదగ్గర సంస్కారం ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది.. మీకు బిడ్డలున్నారు.. రేపు నేను పోయినా కూడా ఫలానా వాళ్ల బిడ్డలు అని అంటే గౌరవం పెరుగుతుంది కానీ.. పలానా వాళ్ల బిడ్డ అంటే గౌరవం తగ్గేలా చేసుకొవద్దన్నట్లుగా” సూచించారు.

ఇదే క్రమంలో... "చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని తప్పులు మాట్లాడారు పోసాని గారూ?" అని ప్రశ్నించిన శివాజీ... "1998లో ఈనాడు పత్రికలో చంద్రబాబు గురించి పెద్ద ప్రకటన ఇచ్చిన పోసాని.. అప్పటి చంద్రబాబుకూ, ఇప్పటి చంద్రబాబుకూ ఉన్న తేడా ఏమిటి" అని ప్రశ్నించారు. "చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేశారు.. బడుగు బలహీనవర్గాలను రాజ్యాధికారంలోకి తీసుకురావాలనే పనిని కంటిన్యూ చేశారు" అని అన్నారు.

"మీరు కూడా చంద్రబాబు గురించి ఎంత నీచంగా మాట్లాడారు.. పైగా డబుల్ ఎంకాం అంటారు.. పెద్ద రచయిత మీరు.. వందలాది సినిమాలు చేశారు. ఎంతసేపు సర్ వాళ్లు ఇప్పుడు మనల్ని తన్నడానికి" అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతుంది.

Tags:    

Similar News