కొత్త సంవ‌త్స‌రంలో SJ సూర్య కొత్త ప్ర‌క‌ట‌న‌

ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగా గొప్ప పేరున్న‌వాడు SJ సూర్య. దశాబ్దం తర్వాత తిరిగి `కిల్లర్` అనే చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

Update: 2024-12-04 14:30 GMT

ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగా గొప్ప పేరున్న‌వాడు SJ సూర్య. దశాబ్దం తర్వాత తిరిగి `కిల్లర్` అనే చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం త‌న గ‌త చిత్రానికి సీక్వెల్‌గా ఉండే అవకాశం ఉందని స‌మాచారం. ఇది ఎస్‌.జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం జనవరి 2025లో సెట్స్‌పైకి వెళుతుంది.

ప్ర‌స్తుతం అత‌డి న‌ట‌నా కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. తమిళం -తెలుగులో అత‌డు వ‌రుస‌ చిత్రాలకు సంతకం చేశాడు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్` చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. గ‌తంలోను అత‌డు మార్క్ ఆంటోని, స‌రిపోదా శ‌నివారం, రాయ‌న్ లాంటి హిట్ చిత్రాల్లో అత‌డు న‌టుడిగా మెప్పించాడు. న‌ట‌న‌లో బిజీగా ఉన్న ఈ స‌మ‌యంలో అత‌డు మళ్లీ సినిమాకి దర్శకత్వం వహించడానికి సిద్ధమ‌వుతున్నాడు. SJ సూర్య చివరిగా దర్శకత్వం వహించిన ఇసై 2015 లో విడుదలైంది. ఇప్పుడు ఒక దశాబ్దం తర్వాత అత‌డు రీబూట్ అవుతున్నాడు. కిల్ట‌ర్ అనే టైటిల్ ని ఎంపిక చేసినా ఇంకా కాస్టింగ్ టెక్నీషియ‌న్స్ వివ‌రాల్ని వెల్ల‌డించ‌లేదు. ఈ వివ‌రాలు త్వరలో అధికారిక ప్రకటనలో వెల్ల‌డిస్తార‌ని స‌మాచారం.

ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్.జే సూర్య మాట్లాడుతూ.. శంకర్ దర్శకత్వం వహిస్తున్న `గేమ్ ఛేంజర్` విడుద‌ల‌యిన‌ వారం తర్వాత త‌న కొత్త‌ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన చేస్తాన‌ని తెలిపారు. నా దగ్గర ప్రత్యేకమైన.. మంచి స్క్రిప్ట్ ఉంది..దానికి దర్శకత్వం వహించే ఆలోచనలు ఉన్నాయి. కానీ నేను నటన కంటే దర్శకత్వానికి ఎక్కువ‌ ప్రాధాన్యత ఇవ్వ‌లేన‌ని కూడా అన్నాడు. నేను ఇతర దర్శకుల స్టైల్‌లను చూడాలనుకుంటున్నాను. నా స్టైల్‌తో అనవసరంగా ఉండాలనుకోను. సినిమాలో నా నెక్ట్స్ ఏంటో ప్రజలు సులభంగా గుర్తిస్తారు కాబట్టి నేను ఆకస్మికంగా వైవిధ్యంగా ఉండాలనుకుంటున్నాను అని కూడా వ్యాఖ్యానించారు.

విఘ్నేష్ శివన్ - లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎస్‌.యు అరుణ్ కుమార్ -వీర ధీర సూరన్ ... PS మిత్రన్ - సర్దార్ 2 చిత్రాల్లో ఎస్.జే.సూర్య ప్ర‌స్తుతం న‌టిస్తున్నారు. తెలుగులో గేమ్ ఛేంజ‌ర్ అత‌డి గేమ్ ఛేంజ్ చేస్తుంద‌ని ఆశిస్తున్నాడు.

Tags:    

Similar News