సమంత అంటే చాలా ఇష్టం... తనే నా సోల్‌మేట్
తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా కెరీర్ లో నిలదొక్కుకోవడం కష్టం, హీరోయిన్గా ఆఫర్లు దక్కించుకోవడం చాలా పెద్ద విషయం అనే అభిప్రాయం ఉంది
తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా కెరీర్ లో నిలదొక్కుకోవడం కష్టం, హీరోయిన్గా ఆఫర్లు దక్కించుకోవడం చాలా పెద్ద విషయం అనే అభిప్రాయం ఉంది. అలాంటిది తెలుగు అమ్మాయిలు బాలీవుడ్లో అడుగు పెట్టడం చాలా పెద్ద విషయం. అది కూడా అక్కడ మంచి గుర్తింపు దక్కించుకుని స్టార్ డం దక్కించుకోవడం మరింత పెద్ద విషయం అనడంలో సందేహం లేదు. అలాంటి పరిస్థితుల మధ్య తెలుగు అమ్మాయి శోభితా దూళిపాళ మోడలింగ్ చేస్తూ బాలీవుడ్లో అడుగు పెట్టి, అక్కడ మంచి గుర్తింపు దక్కించుకుని స్టార్ హీరోల సినిమాల్లో, వెబ్ సిరీస్ ల్లో నటించడం ద్వారా మంచి గుర్తింపు, స్టార్ డం దక్కించుకుంది.
శోభితా దూళిపాళ ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ మోస్ట్ బిజీ హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. నటిగా ఆమె ఇప్పటికే మంచి మార్కులు దక్కించుకుంది. కెరీర్ ఆరంభంలో అందం విషయంలో విమర్శలు ఎదుర్కొన్న శోభితా ఇప్పుడు విమర్శించిన వారితోనే ప్రశంసలు దక్కించుకుంటుంది. నటిగా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు, సిరీస్ లు చేసిన ఈమె వ్యక్తిగత జీవితంలో కీలక అడుగు వేయబోతుంది. ఇటీవలే అక్కినేని నాగచైతన్య తో వివాహ నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి వివాహం జరుగుతుంది. అందుకు సంబంధించిన ప్రకటన సైతం రాబోతుంది. తాజాగా ఒక మీడియా చిట్ చాట్ లో శోభితా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
సినిమాను కెరీర్‌గా ఎంపిక చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. డిగ్రీ చదువుతున్నప్పుడు ఆర్థిక పరమైన ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని అనుకున్నాను. కాలేజ్ రోజుల్లో స్నేహితులు సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నా నేను ఫైనాన్స్ విషయాలపై మాట్లాడుతూ ఉంటే అంతా నన్ను వింతగా చూసే వారు. కానీ మోడలింగ్‌లో అడుగు పెట్టడం ద్వారా సినిమాల్లో మెల్ల మెల్లగా ఆఫర్లు వచ్చాయి. మొదట మోడలింగ్ కు నన్ను పనికి రావు అన్నారు. కనీసం బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టుగా కూడా నన్ను, నా కలర్ ను ఉద్దేశించి విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి నేను మెల్ల మెల్లగా నేర్చుకుంటూ వచ్చాను.
తన సోదరి సమంత గురించి శోభితా దూళిపాళ మాట్లాడుతూ... సమంత నాకు సోల్‌మేట్. ఇటీవలే తన పెళ్లి అయింది. తన పెళ్లిలో తనంత అందంగా రెడీ అవ్వాలని నేను అనుకున్నాను. కానీ పెళ్లి పనులతో నేను చాలా బిజీగా ఉండటం వల్ల రెడీ అవ్వలేక పోయాను. పెళ్లి పీటలపై తనను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది. చాలా అందంగా పెళ్లి పీటల మీద తనను చూస్తూ ఉంటే కన్నీళ్లు ఆగలేదు. సమంత అంటే నాకు చాలా ఇష్టం. తను ఎప్పటికి నా సోల్మేట్గానే ఉంటుంది. నేను లో గా ఉన్న సమయంలో చాలా మద్దతుగా నిలుస్తుంది. అంతే కాకుండా ప్రతి సందర్భంలోనూ నాకు తను అండగా నిలిచింది. అందుకే ప్రతి విషయంలోనూ తనతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అన్నట్లుగా సోదరి సమంత గురించి శోభిత చెప్పుకొచ్చింది.