చీరందంలో శోభిత..ఎంత అందంగా అంటే?

ఇదిగో ఇక్క‌డిలా క్రీమ్ సారీ మ్యాచింగ్ బ్లౌజ్ లో ఎంతో అందంగా క‌నిపిస్తుంది.

Update: 2024-09-22 08:02 GMT

తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎంత మంది తెలుగు హీరోయిన్లు ఉన్నా శోభిత మాత్రం టాలీవుడ్ ని దాటి బాలీవుడ్ కి దూసుకెళ్లిన న‌టి. ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు త‌న‌ని తాను మౌల్డ్ చేసుకుంటూ నార్త్ బ్యూటీల‌కు ఏమాత్రం త‌క్కువ కాద‌ని ప్రూవ్ చేస్తుంది. ఆ ర‌కంగా ట్రెండ్ ని ఫాలో అవుతుంది కాబ‌ట్టే ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ద‌క్కించుకుంది. అందుకే ఇప్పుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌ని ప్రేమ వివాహం చేసుకుంటుంది.

 

శోభిత పుట్టింది తెనాలి అయినా! పెరిగింది అంతా విశాఖ ప‌ట్ట‌ణంలోనే. చిన్న నాటి నుంచి నార్త్ క‌ల్చ‌ర్ కి అల‌వాటు ప‌డిన బ్యూటీ. మోడ్ర‌న్ క‌ల్చ‌ర్ లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. ఆమె ఆలంక‌ర‌ణ‌..దుస్తులు ఎంపిక ప్ర‌తీది నార్త్ బ్యూటీని త‌ల‌పిస్తుంది. తెలుగు సంప్ర‌దాయంలో క‌నిపించ‌డం అన్న‌ది చాలా రేర్. వీలైనంత వ‌ర‌కూ ఆల్ట్రా మోడ్ర‌న్ దుస్తుల్లో క‌నిపించ‌డానికే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంది.

 

మ‌రి ఇది చైత‌న్య తెచ్చిన మార్పా? త‌న‌లో క‌లిగిన మార్పా? అన్న‌ది తెలియ‌దు గానీ..తాజాగా శోభిత సంప్ర‌దాయ చీరందంలో త‌ళుక్కున మెరిసింది. ఇదిగో ఇక్క‌డిలా క్రీమ్ సారీ మ్యాచింగ్ బ్లౌజ్ లో ఎంతో అందంగా క‌నిపిస్తుంది. డిజైన‌ర్ చెవులీలు...చేతికి ఎంపిక చేసుకున్న మ్యాచింగ్ యాక్స‌ర‌సీస్...మ్యాక‌ప్ ఇత‌ర అలంక‌ర‌ణ ప్రీతీది శోభిత‌ని ఎంతో అందంగా తీర్చి దిద్దాయి.

 

నుదిటిన ఎరుపు వ‌ర్ణం చిన్న బొట్టు మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. అన్నీక్లోజప్ షాట్స్ లోనూ వివిధ భంగిమ‌ల్లో శోభిత ఎంతో అందంగా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక శోభిక కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క్రేజీ ప్రాజెక్ట్ ల్లో అవ‌కాశాలు అందుకుంటుంది.

Tags:    

Similar News