ఆవిడ తర్వాత పరిశ్రమ నుంచి ఈవిడేనా?
ప్రపంచంలో అత్యదిక ధనిక నటి ఎవరు అంటే? ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది.
ప్రపంచంలో అత్యదిక ధనిక నటి ఎవరు అంటే? ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. టేలర్ స్విప్ట్.. రిహాన్నా, సెలీనా గోమేజ్ లాంటి వాళ్లను వెనక్కి నెట్టి అమెరికన్ నటి, ఎంటర్ పెన్యూనర్ జామీ గర్టేజ్ అనే కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. ఈమె సినిమాల ద్వారానో...బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసో, సొంతంగా వ్యాపారాలు చేసో ఈ స్థానాన్ని సంపాదించలేదు. అమెరికన్ బిలీయనీర్ వ్యాపార వేత్త టోనీ రెస్లర్ ను వివాహం చేసుకోవడంతో ఆమె దశ తిరగింది.
భర్తతో కలిసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంతోనే ఈ ఫీట్ సాధించగలిగింది. మరి బాలీవుడ్ లో అలాంటి నటి ఎవరైనా ఉన్నారా? అంటే లెజెండరీ నటుడు అనీల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ కనిపిస్తుంది. `ఢిల్లీ-6`, `రాంఝనా,` భాగ్ మిల్కా భాగ్`,` థాంకీ`, ప్రేమ్ రతన్ ధన్ పాయో వంటి సినిమాలతో సోనమ్ ఎంత పాపులర్ అయిందన్నది చెప్పాల్సిన పనిలేదు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అనతి కాలంలోనే సక్సెస్ అయింది.
అయితే ఈ అమ్మడు పెళ్లి విషయంలో పెద్దగా సమయం తీసుకోలేదు. సడెన్ గా ఓ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది. మరోసారి ఆ వివరాల్లోకి వెళ్తే..`సింగపూర్‌లోని యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో చైనీస్ రెస్టారెంట్‌లో సర్వర్‌గా పనిచేసింది సోనమ్. ఈస్ట్ లండన్ యూనివర్శిటీ నుంచి తన అండర్ గ్రాడ్యుయేట్ చదువును పూర్తి చేసింది. 2018లో ఆనంద్ అహుజాని వివాహం చేసుకుంది.
సోనమ్ భర్త ఆస్తుల విలువ అక్షరాల రూ.4000 కోట్లకు పైమాటే. అంతేకాదు ఢిల్లీలో ఓ ఇంటి ఖరీదు అక్షరాల రూ.173 కోట్లు. ప్రస్తుతం సోనమ్ కపూర్- ఆమె భర్త లండన్‌లో సెటిల్ స్థిరపడ్డారు. వ్యాపారాలు అన్నింటిని అక్కడ నుంచే నిర్వహిస్తున్నారు. అలా సోనమ్ కపూర్ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ ని పెళ్లాడి హీరోయిన్లలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది.