స్క్విడ్ గేమ్ 3కి సూపర్ స్టార్ కలరింగ్..!
ఐతే టాక్ తో సంబంధం లేకుండా స్క్విడ్ గేమ్ 2 మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ నెట్ ఫ్లిక్స్ లో దూసుకెళ్తుంది.
కొరియన్ వెబ్ సీరీస్ లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్క్విడ్ గేమ్ సీరీస్ నుంచి ఈమధ్యనే రెండో సీజన్ వచ్చిన విషయం తెలిసిందే. స్క్విడ్ గేమ్ 1 చూసి బాబోయ్ అనుకున్న వారికి రెండో సీజన్ అంత కిక్ ఇవ్వలేదన్న టాక్ ఉంది. ఏదైనా సరే మొదటి సీజన్ లెక్క వేరు అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఐతే స్క్విడ్ గేమ్ 2 పై ఉన్న అంచనాలు ఎక్కువ ఉండటం వల్లే ఈ సీజన్ కి ఇలాంటి టాక్ వచ్చింది. ఐతే టాక్ తో సంబంధం లేకుండా స్క్విడ్ గేమ్ 2 మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ నెట్ ఫ్లిక్స్ లో దూసుకెళ్తుంది.
ఐతే స్క్విడ్ గేమ్ 1 హిట్ అయ్యాక సీజన్ 2 కోసం 3 ఏళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. స్క్విడ్ గేమ్ 2 ఎప్పుడు వస్తుందా అని ఆ సీరీస్ లవర్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఐతే స్క్విడ్ గేమ్ 2 చివర్లో 3 వ సీజన్ ట్విస్ట్ ఇచ్చారు. ఐతే స్క్విడ్ గేమ్ 1 తర్వాత సీజన్ 2 కి 3 ఏళ్ల గ్యాప్ తీసుకోగా ఇది ఇంకెన్నేళ్లు తీసుకుంటారో అనుకున్నారు. కానీ స్క్విడ్ గేమ్ 3 పై లేటెస్ట్ టాక్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.
స్క్విడ్ గేమ్ 3 ని ఈ ఇయర్ జూన్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అందుకు తగినట్టుగా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఐతే మరోపక్క స్క్విడ్ గేమ్ 3 కి సూపర్ స్టార్ కలరింగ్ ఉంటుందని టాక్. అంటే స్క్విడ్ గేమ్ థర్డ్ సీజన్ లో టైటానిక్ స్టార్ లియోనార్డో డికాప్రియో కూడా భాగం అవుతున్నాడని తెలుస్తుంది. అదే నిజమైతే మాత్రం సినీ లవర్స్ కి పండగ అన్నట్టే లెక్క. స్క్విడ్ గేమ్ సీరీస్ లో లీ జంగ్ జె, వైహాజూన్, లీ బ్యుంగ్ హున్ లు నటించారు.
ఐతే స్క్విడ్ గేమ్ 3 లో లియోనార్డ్ నటిస్తాడన్న వార్త బలంగా వినబడుతుంది. అతను ఈ క్రేజీ సీరీస్ లో నటిస్తే మాత్రం వరల్డ్ వైడ్ గా మరింత క్రేజ్ ఏర్పడుతుంది. స్క్విడ్ గేమ్ 1, 2 సీరీస్ లు తెలుగు ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నెట్ ఫ్లిక్స్ తెలుగులో ఈ సీరీస్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే స్క్విడ్ గేమ్ 1 కన్నా స్క్విడ్ గేమ్ 2 ది బెస్ట్ అనిపించుకోలేకపోయింది. మరి థర్డ్ సీజన్ లో ఇలాంటి అసంతృప్తి లేకుండా చేస్తారేమో చూడాలి.