శ్రీలీలపై ఫుల్ ఫోకస్.. అందుకేనా?

యంగ్ బ్యూటీ శ్రీలీల.. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులారిటీ, క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-18 14:30 GMT

యంగ్ బ్యూటీ శ్రీలీల.. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులారిటీ, క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు అన్నట్లుగా ఫేమ్ ను దక్కించుకుంది అమ్మడు. అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ కన్నడ మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. శ్రీలీల డెబ్యూ మూవీ కిస్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందD మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ శ్రీలీల తన అందం, అభినయంతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత రవితేజ ధమాకా మూవీలో యాక్ట్ చేసి ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చేసింది. సెన్సేషనల్ హీరోయిన్ గా మారి.. టాలీవుడ్ లో ఓ రేంజ్ లో అవకాశాలు అందుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆఫర్లు కొట్టేసింది. కానీ ఆమె నటించిన సినిమాల్లో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ తప్ప మిగతా చిత్రాలు అన్నీ అంతగా మెప్పించలేకపోయాయి.

దీంతో కాస్త స్లో అయిన శ్రీలీల.. ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేసి నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటోంది. బాలీవుడ్, కోలీవుడ్ లో తన సత్తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. త్వరలోనే బీ టౌన్ లోకి అడుగుపెట్టనుంది. అయితే కొద్ది రోజులుగా నేషనల్ వైడ్ గా మీడియా దృష్టంతా శ్రీలీలపై పడ్డట్టు కనిపిస్తుంది. అందుకు కారణం తెలియకపోయినా.. ఫోకస్ పడిన విషయం మాత్రం నిజమనే చెప్పాలి.

బాలీవుడ్ లోకి అమ్మడు ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో ఇలా జరుగుతుందేమోనని కొందరు అంటున్నారు. బీ టౌన్ స్టార్, దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ మూవీతో శ్రీలీల.. నార్త్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీం హీరోగా చేస్తున్న దిలేర్ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోంది. ఆ సినిమాలో హీరోయిన్ గా సౌత్ బ్యూటీ శ్రీలీలను ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది.

అదే సమయంలో మరో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. బల్వీందర్‌ సింగ్‌ జంజువా దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కుతున్న చిత్రం మిట్టిలో శ్రీలీలను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ నెలలో ఆ మూవీ పట్టాలెక్కనుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అమ్మడు.. నార్త్ లో ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News