పిక్‌టాక్‌ : స్టైలిష్‌ డ్రెస్‌లో క్యూట్‌ శ్రీలీల

తాజాగా ఈ అమ్మడు మరోసారి తన అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్‌ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Update: 2024-12-18 05:31 GMT

రాఘవేంద్ర రావు కొత్త 'పెళ్లి సందడి' ముద్దుగుమ్మ శ్రీలీల టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్న శ్రీలీల సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ అమ్మడు మరోసారి తన అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్‌ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్టైలిష్‌ డ్రెస్‌లో క్యూట్‌ శ్రీలీల భలే అందంగా ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఫ్యాన్స్ తెగ లైక్ చేస్తూ షేర్‌ చేస్తున్నారు.

శ్రీలీల రెగ్యులర్‌గా కనిపించే ఔట్‌ ఫిట్‌లో కాకుండా ఈసారి చాలా విభిన్నమైన స్టైలిష్ కాస్ట్యూమ్స్‌ను ట్రై చేసింది. సన్నగా నాజూకుగా ఉండే శ్రీలీలకు ఎలాంటి డ్రెస్ అయినా సెట్‌ అవుతుంది అంటూ ఈ ఫోటోలను చూస్తే అర్థం అవుతుంది. క్లీ వేజ్‌ షో, చీర కట్టు ఫోటోలు, నడుము అందం చూపించిన ఫోటోలు చాలానే వైరల్ అయ్యాయి. అయితే ఈసారి పెద్దగా స్కిన్‌ షో చేయకున్నా శ్రీలీల ఈ ఫోటోలతో వైరల్ కావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి ఈ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి అనేది ఫ్యాన్స్‌ అభిప్రాయం.

ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబుతో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బక్సాఫీస్ వద్ద నిరాశ పరచింది. అయినా శ్రీలీల క్రేజ్ తగ్గలేదు. అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమాలో అయిదు నిమిషాల ఐటెం సాంగ్‌ కోసం ఏకంగా రూ.2 కోట్ల పారితోషికం తీసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న రాబిన్‌హుడ్‌ సినిమాలో నితిన్‌కు జోడీగా నటించడం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.

పుష్ప 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కిస్సిక్‌ సాంగ్‌ చేసిన శ్రీలీలకు అంతే స్థాయిలో గుర్తింపు లభించింది. అందుకే హిందీ, తమిళ్ సినిమాల్లోనూ ఈమెకు నటించేందుకు ఆఫర్లు వస్తున్నాయి. కానీ తెలుగులో మాత్రమే ఎక్కువ సినిమాలు చేస్తున్న ఈమె తమిళ్‌లో ఒక స్టార్‌ హీరోకు జోడీగా నటించేందుకు ఓకే చెప్పింది. త్వరలో ఈ అమ్మడు నవీన్‌ పొలిశెట్టి హీరోగా రూపొందబోతున్న సినిమాలో నటించబోతుంది. ఇటీవల బాలకృష్ణ టాక్‌ షో కి వచ్చిన సమయంలో ఆ విషయమై క్లారిటీ వచ్చింది.

Tags:    

Similar News