తెలుగమ్మాయ్ ముగింపు రాక్ సాలిడ్ గా!
2024 ముగింపు కొచ్చేసాం. ఇంకొన్ని రోజుల్లో కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పబోతున్నాం.
2024 ముగింపు కొచ్చేసాం. ఇంకొన్ని రోజుల్లో కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పబోతున్నాం. అంతా సెలబ్రేషన్లకు రెడీ అవుతున్నారు. దేశాలు...ఖండాలు దాటి పోవడానికి సంసిద్దంగా ఉన్నారు. ఇక ఈ ఏడాదిని `పుష్ప-2` భారీ విజయంతో టాలీవుడ్ గ్రాండ్ గా ముగిస్తుంది. మరి తెలుగమ్మాయి శ్రీలీల ఎలా ముగించబోతుంది? అంటే అమ్మడు రాక్ సాలిడ్ గా ముగింపు పలుకుతుంది. ఈ ఏడాది శ్రీలీల ఆరంభంలో `గుంటూరు కారం`తో బ్లాక్ బస్టర్ అందుకుంది.
అందులో సూపర్ స్టార్ మహేష్ కి జోడీగా నటించి ప్రేక్షకుల్ని అలరించింది. గత ఏడాది `భగవంత్ కేసరి`తో మంచి విజయం ఖాతాలో వేసుకున్నా `స్కంద`, `ఆదికేశవ`, `ఎక్స్ ట్రా ఆర్డినర్ మ్యాన్` లాంటి సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేదు. కానీ ఈ ఏడాది మాత్రం `గుంటూరు కారం`తో పాటు పాన్ ఇండియాలోనే ఫేమస్ అయింది. ఇటీవల రిలీజ్ అయిన `పుష్ప-2` `కిసిక్` అంటూ ఐటం పాటతో ఇండియాని ఊపేసింది.
ఒక్క పాటతో తెలుగమ్మాయి సత్తా పాన్ ఇండియాలోనే చాటింది. `ఊ అంటావా` పాటతో సమంతకు ఎంత గుర్తింపు వచ్చిందో? అంతకు మించిన గుర్తింపు లాంగ్ రన్ లో శ్రీలలకు దక్కుతుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే ఆ పాటకు సోషల్ మీడియాలో రీల్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇదే నెలలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న `రాబిన్ హుడ్` రిలీజ్ అవుతుంది. ఇందులో యూత్ స్టార్ నితిన్ కి జోడీగా నటించింది.
వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇంత వరకూ అతడికి ఫెయిల్యూర్ లేదు. దీంతో ఈ సినిమాపై అంచనాలతో పాటు..సక్సెస్ అవుతుందనే నమ్మకం అందరిలో ఉంది. విజయం సాధిస్తే శ్రీలీలకు ఈ సినిమా ఓ బోనస్ లాంటింది. ఈ ఏడాది హీరోయిన్ గా పెద్దగా సినిమాలు చేయకపోయినా శ్రీలీల క్రేజ్ మాత్రం ఎక్కడా కింగలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకు రెట్టింపు అవుతూనే ఉంది. కొత్త ఏడాది 2025 లో `మాస్ జాతర`, `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రాలతో అలరించనుంది.