ఆయన పక్కన శ్రీలీల.. సూటవుతుందా?
దీంతో ఒక్కసారిగా శ్రీలీల ఊపు తగ్గిపోయింది. మధ్యలో ఆగిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మినహా తెలుగులో ఆమెకు ఛాన్సులు లేవు
తెలుగులో కెరటంలా ఎగసి.. కింద పడింది శ్రీలీల. ‘పెళ్ళిసందడి’ లాంటి చిన్న సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయినప్పటికీ ఆ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టి పెద్ద పెద్ద చిత్రాల్లో అవకాశాలు తెచ్చిపెట్టింది. రెండో చిత్రం ‘ధమాకా’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమె రేంజే మారిపోయింది. ఏకంగా మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ చేసే అవకాశం దక్కించుకుంది. కానీ ఈ చిత్రంలో శ్రీలీల పాత్ర, నటన తేలిపోయాయి.
సినిమా కూడా సరిగా ఆడలేదు. అంతకంటే ముందు స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ లాంటి డిజాస్టర్లు ఖాతాలో వేసుకుంది శ్రీలీల. చూడ్డానికి క్యూట్‌గా అనిపించినా.. తాను పోషించే పాత్రలకు తగ్గ వెయిట్ తీసుకురాలేకపోవడం, హీరోల పక్కన మరీ చిన్నపిల్లలా అనిపిస్తుండటం, వాయిస్ కూడా మైనస్ కావడంతో శ్రీలీల పట్ల ప్రేక్షకుల్లో క్రమంగా నెగెటివిటీ వచ్చేసింది.
దీంతో ఒక్కసారిగా శ్రీలీల ఊపు తగ్గిపోయింది. మధ్యలో ఆగిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మినహా తెలుగులో ఆమెకు ఛాన్సులు లేవు. ఇలాంటి టైంలో ఆమెకు తమిళంలో ఓ బంపరాఫర్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ సరసన శ్రీలీల నటించబోతోందని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ‘విడా ముయర్చి’ అనే యాక్షన్ మూవీ చేస్తున్న అజిత్.. దీని తర్వాత తన వీరాభిమాని అయిన ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ మూవీ ఓకే చేశాడు. అందులో శ్రీలీలను కథానాయికగా కన్సిడర్ చేస్తున్నారట. ఐతే మహేష్ బాబు పక్కనే శ్రీలీల చిన్న పిల్లలా కనిపించింది. అలాంటిది అజిత్ పక్కన అంటే ఆమెను చూడలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అజిత్ తెల్ల జుట్టుతో, భారీ అవతారంతో సినిమాలు చేసేస్తుంటాడు. ఆయన పక్కన అనుభవం ఉన్న హీరోయిన్లే సూట్ కాని పరిస్థితి. అలాంటిది శ్రీలీల జోడీగా నటిస్తే మరీ ఎబ్బెట్టుగా ఉంటుందేమో.