శ్రీలీల‌ అవ‌కాశాన్ని ఆమె లాగేసుకుంటుందా?

అయితే స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఆ ఛాన్స్ కోసం అన‌న్యా పాండే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో మ‌రో వార్త తెర‌పైకి వ‌చ్చింది

Update: 2024-07-10 14:30 GMT
శ్రీలీల‌ అవ‌కాశాన్ని ఆమె లాగేసుకుంటుందా?
  • whatsapp icon

శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ కోసం ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే.టాలీవుడ్ లో అవ‌కాశాలు త‌గ్గ‌డంతో అమ్మ‌డు అటువైపుగా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఈ నేప‌థ్యంలో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా తెర‌కెక్క‌నున్న రొమాంటిక్ చిత్రంలో సెకెండ్ లీడ్ కి ఎంపిక అవుతుంద‌నే ప్ర‌చారం సాగింది. మేక‌ర్స్ ఆమెతో సంప్ర‌దిం పులు జ‌రుపుతున్న‌ట్లు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు వారంతో క్రితం మ‌రో వార్త తెరపైకి వ‌చ్చింది. దీంతో శ్రీలీల డెబ్యూ బాలీవుడ్ క‌న్ప‌మ్ అనుకుంటున్నారు.

అయితే స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఆ ఛాన్స్ కోసం అన‌న్యా పాండే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో మ‌రో వార్త తెర‌పైకి వ‌చ్చింది. స్టార్ కిడ్ బాలీవుడ్ లో త‌న‌కున్న ప‌రిచ‌యాల్ని వినియోగిం చుకుని ప్రాజెక్ట్ లోకి ఎంట‌ర్ అయ్యే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిందిట‌. ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు డేవిడ్ ధావ‌న్ తో చ‌ర్చ‌లు జ‌రిపిందిట‌. అటుపై హీరో వ‌రుణ్ ధావ‌న్ ని క‌లిసి విష‌యం వివ‌రించిందిట‌.

మ‌రి ఈ ప్ర‌చారంలో వాస్త‌వం ఎంతో తెలియాలి. బాలీవుడ్ లో హీరోయిన్ల మ‌ధ్య ఇలాంటి రాజ‌కీయాలు కొత్తేం కాదు. ఇది అనాధిగా వ‌స్తోన్న ఆచారం లాంటింది అక్క‌డ‌. వార‌సురాళ్లే అక్క‌డ హీరోయిన్ల‌గా ఎంట్రీ ఇచ్చే ప‌ద్ద‌తి ఉంది కాబ‌ట్టి ఇలాంటివి స‌హ‌జంగా క‌నిపిస్తాయి. సీనియ‌ర్ నాయిక‌ల నుంచి న‌వ‌త‌రం భామ‌ల వ‌ర‌కూ ఈ విధానం క‌నిపిస్తూనే ఉంది. శ్రీలీల‌కు అక్క‌డ ఎలాంటి ప‌రిచ‌యాలు లేవు.

కెరీర్ ఇప్పుడే ప్రారంభించించింది. ల‌క్కీ గా టాలీవుడ్ లో క్లిక్ అయింది. ఇదే స‌మ‌యంలో వ‌రుణ్ ప్రాజెక్ట్ కి పిలుపు రావ‌డం, ఆమె వెళ్ల‌డం జ‌రిగింది. ఇంత‌లోనే అన‌న్య రూపంలో ఈ ర‌క‌మైన ప్ర‌చారం తెర‌పైకి రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి ఈ స్నేహంతోనే అన‌న్య ప్రాజెక్ట్ లోకి ఎంట‌ర్ అయితే శ్రీలీల ఆఫ‌ర్ కోల్పోయిన‌ట్లే. చేతి వ‌ర‌కూ వ‌చ్చిన అవ‌కాశాన్ని అన‌న్య లాక్కున్న‌ట్లే అవుతుంది.

Tags:    

Similar News