శ్రీలీల మనసు వెన్న ముద్ద కన్నా గొప్పది!
నాకు పండగలొస్తే అనాధలు గుర్తొస్తారు. పండగొచ్చిందని కొత్త బట్టలు కట్టుకుంటాను. ఇంట్లో అంతా అన్ని రకాల రుచులు వండిపెడతారు.
టాలీవుడ్ లో శ్రీలీల రేర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడిప్పుడు నిర్మాతలకు బంగారు బాతు లాంటింది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. హీరోయిన్ గా చేసినా...కీలకమైన పాత్ర చేసినా సినిమా విజయం సాధించిందంటే? శ్రీలీల కారణమంటున్నారు. ఆరకంగా అమ్మడు టాలీవుడ్ లో లక్కీ చామ్ గా మారిపోయింది. ప్రస్తుతం చేస్తోన్న సినిమాలన్నీ ఒక ఎత్తైతే..'గుంటూరు కారం'లో ఛాన్స్ మరో ఎత్తు.
ఈ సినిమా సక్సెస్ అయితే శ్రీలీలకి ఆకాశమే హద్దు. కెరీర్ ఇంత గొప్పగా సాగుతుందని శ్రీలీల కూడా ఊహించి ఉండదు. చిన్న సినిమాతో పరిచయమై తక్కువ సమయంలోనే తారా స్థాయికి చేరిపోయింది. భవిష్యత్ లో మరిన్ని వండర్స్ క్రియేట్ చేయనుంది. నటిగానే కాదు అమ్మడు గొప్ప వ్యక్తితత్వం ..సహృద యం కలదని తెలుస్తోంది. పండగలొస్తే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అని ప్రశ్న ఏ హీరోయిన్ వేసినా మహా భారతమంతా మట్లాడుతారు.
కుటుంబంతో అలా ఎంజాయ్ చేసాం? ఇలా ఎంజాయ్ చేసాం? ఇలా రకరకాల జరిగిపోయిన విషయా లు..భవిష్యత్ ప్లానింగ్ లు చెబుతుంటారు. కానీ శ్రీలీల చెప్పిన సమాధానం చూస్తే ఆమె మనసు ఎంత గొప్పదన్నది అద్దం పడుతుంది.' నాకు పండగలొస్తే అనాధలు గుర్తొస్తారు. పండగొచ్చిందని కొత్త బట్టలు కట్టుకుంటాను. ఇంట్లో అంతా అన్ని రకాల రుచులు వండిపెడతారు. కానీ అనాధ బాలలు..ఏమీ లేని నిరుపేదలు ఎలా ఉంటున్నారని మనసు చలించిపోతుంది.
పాపం వాళ్ల కోసం అంటూ ఎవరూ ఉండరు. వాళ్ల రోజు ఎలా గడుస్తుందో వాళ్లకే తెలియదు. ఉంటే తింటారు లేకపోతే పస్తుంటారు. అందుకే వీలుంటే అనాధశ్రమాలకు వెళ్లి వాళ్లతో పండగ జరుపుకోవాలని ఉంటుంది. అలాగే చేస్తాను. నాకు చేతనైనంత సహాయం చేస్తాను. ఇది నాకు పండగ ఇచ్చిన గొప్ప ఆనందంగా భావిస్తాను' అంది. ఆమె మాటల్ని బట్టి శ్రీలీల మనసు ఎంత గొప్పదన్నది అద్దం పడుతుంది.