ఫోటో స్టోరి: బాస్ లేడీ శ్రీ‌లీల రెబ‌లిజం

మెయిన్ తేరా హీరో , జుడ్వా 2 లాంటి భారీ విజయాల‌ తర్వాత వరుణ్ ధావన్ - డేవిడ్ ధావన్ మూడవసారి క‌లిసి ప‌ని చేస్తున్న క్రేజీ మూవీలో శ్రీ‌లీల అవ‌కాశం అందుకుంది.

Update: 2024-07-03 05:44 GMT

తెలుగ‌మ్మాయి శ్రీలీల క్రమంగా అన్ని పరిశ్రమల్లో త‌నదైన ముద్ర వేస్తూ ఎదుగుతోంది. తెలుగు, త‌మిళంతో పాటు ఇప్పుడు హిందీ ప‌రిశ్ర‌మ‌లోను ప్ర‌వేశిస్తోంది శ్రీ‌లీల‌. వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న ఈ బ్యూటీ భారీ చిత్రంలో న‌టించేందుకు సంత‌కం చేసిన సంగ‌తి తెలిసిందే.

 

నిజానికి శ్రీ‌లీల కెరీర్ కన్నడ చిత్రం కిస్‌తో ప్రారంభమైంది. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా 100 రోజులకు పైగా విజయవంతమైన రన్‌ను కొన‌సాగించింది. కన్నడ చిత్ర‌సీమ‌లో వ‌రుస అవ‌కాశాలు అందుకుంది. అదే స‌మ‌యంలో `పెళ్లి సందడి`తో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేయడం అటుపై త‌న హవా గురించి ప‌రిచ‌యం అస‌రం లేదు.

 

అద్భుత‌మైన డ్యాన్సింగ్ స్కిల్, న‌ట‌ప్ర‌తిభ‌తో మంత్ర‌ముగ్ధుల‌ను చేసే ఈ తెలుగ‌మ్మాయి ప్ర‌భ ఇప్పుడు అన్ని వైపులా విస్త‌రిస్తోంది. త్రివిక్రమ్ గుంటూరు కారంలో మహేష్ బాబుతో కలిసి నటించిన ఈ భామ ర‌వితేజ లాంటి మాస్ హీరోతోను కెరీర్ ఆరంభ‌మే అవ‌కాశం అందుకుంది. ధ‌మాకా త‌ర్వాత మ‌ళ్లీ ర‌వితేజ‌తో మ‌రో సినిమాకి ఈ బ్యూటీ సంత‌కం చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న స్పీడ్ కి త‌గ్గ‌ట్టే వ‌రుస‌గా బ్రాండ్స్ ప్ర‌మోష‌న్స్ కి అవ‌కాశాలు అందుకుంటోంది. చెన్నై కి చెందిన‌ అమృత గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ ఆర్. బూమినాథన్ నటి శ్రీలీలని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు.

Read more!

 

హిందీ చిత్ర‌సీమ‌లో ఎంట్రీ:

మెయిన్ తేరా హీరో , జుడ్వా 2 లాంటి భారీ విజయాల‌ తర్వాత వరుణ్ ధావన్ - డేవిడ్ ధావన్ మూడవసారి క‌లిసి ప‌ని చేస్తున్న క్రేజీ మూవీలో శ్రీ‌లీల అవ‌కాశం అందుకుంది. ధావ‌న్ బోయ్స్ ఇద్దరూ కొంతకాలంగా అనేక థీమ్ లైన్స్ పై చర్చిస్తున్నారు. జులై 2024 నుండి తమ తదుపరి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ధావ‌న్ ల‌కు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. పూర్తి వినోదంతో కూడుకున్న ఒక అద్బుత‌మైన స్క్రిప్ట్ లాక్ అయింద‌ని తెలిసింది.

 

ఈ కామిక్ కేపర్‌లో వరుణ్ ధావన్ స‌ర‌స‌న శ్రీ‌లీల న‌టించాల‌ని డేవిడ్ ధావన్ బ‌లంగా కోరుకున్నార‌ని టాక్. టిప్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రమేష్ తౌరానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని డేవిడ్ ధావన్ కామెడీల మాదిరిగానే, ఇది కూడా ఒక ముక్కోణ ప్రేమ‌క‌థ‌..అందులోంచి పుట్టుకొచ్చే హాస్యం.. లీడ్ పాత్ర‌ల జీవితంలో గందరగోళం నేప‌థ్యంలో ఆద్యంతం వినోదంతో పాటు ఎమోష‌న్ ను పండించ‌నుంద‌ని స‌మాచారం. ఈ చిత్రంలో వరుణ్‌ ప్రేమికురాలిగా శ్రీ‌లీల న‌టించ‌నుంది. ఇది పక్కా-కమర్షియల్ ఎంటర్‌టైనర్ . హిందీ మార్కెట్‌లలో తనకు ఇది సరైన లాంచ్ ప్యాడ్ అని శ్రీలీల కూడా భావిస్తుంది అని తెలిసింది.

రెబ‌లిజం చాలు:

హిందీ మార్కెట్లో అడుగుపెడుతున్న శ్రీలీల ఇటీవ‌ల బాస్ లేడీ లుక్ ని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. తెలుగమ్మాయి రెబ‌లిజం ఇప్పుడు ఉత్త‌రాదినా హాట్ టాపిక్ గా మారుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

Tags:    

Similar News

eac