ఆగస్టంతా స్టార్ హీరోల అప్డేట్లే అప్డేట్లు..

అయితే వీటితో పాటు పలు భారీ చిత్రాల అప్డేట్స్ కూడా ఈ నెలలోనే వచ్చేందుకు రెడీ అయ్యాయి.

Update: 2023-08-02 00:30 GMT

బాక్సాఫీస్ వద్ద జులై సందడి ముగిసింది. 'బేబీ', 'బ్రో' చిత్రాలు థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నాయి. ఇందులో 'బేబీ' సెన్సేషనల్ హిట్ అవ్వగా.. పవన్ 'బ్రో' పర్వాలేదనిపించింది. ఇక ఆగస్ట్ వంతు మొదలైంది. దీంతో ఈ నెలలో రానున్న సినిమాలపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. అయితే వీటితో పాటు పలు భారీ చిత్రాల అప్డేట్స్ కూడా ఈ నెలలోనే వచ్చేందుకు రెడీ అయ్యాయి.

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. షూటింగ్ విషయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న ఈ సినిమా నుంచి ఎట్టకేలకు ఓ అప్డేట్ రానుంది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'సలార్‌: సీజ్‌ఫైర్‌'. ఇప్పటికే టీజర్‌ తో దుమ్మురేపిన ఈ సినిమా.. ఇప్పుడు ట్రైలర్ తో షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. అలాగే ఓ సాంగ్ కూడా రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శ్రుతి హాసన్‌ నటిస్తోంది. జగపతిబాబు, ఈశ్వరీరావు, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ నటిస్తున్న భారీ పొలిటికల్ థ్రిల్లర్ 'గేమ్‌ ఛేంజర్‌'. ఇప్పటికే షూటింగ్ కొన్ని షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నెలలో ఓ కొత్త అప్డేట్ ఇచ్చేందుకు మూవీటీమ్ ప్లాన్ చేస్తోందట.

'ఘోస్ట్' ఫ్లాప్ తర్వాత చాలా కాలమైన నాగార్జున ఇప్పటివరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. ఆయన రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ తో ఓ సినిమా చేయబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇక తాజాగా ఆయన ధనుశ్ శేఖర్ కమ్ముల సినిమాలో కనిపిస్తారని అంతా అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన కొత్త సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్, ఫస్ట లుక్ పోస్టర్ వస్తుందని తెలిసింది.

ఇక మెగా స్టార్ చిరు మరి కొన్ని రోజుల్లో 'భోళాశంకర్'తో థియేటర్లలో సందడి చేయనున్నారు. దీని తర్వాత తన కొత్త సినిమాను 'బంగార్రాజు' దర్శకుడు కల్యాణ్ కృష్ణతో ఓ సినిమా చేయనున్నారు. మలయాళ హిట్ 'బ్రో డ్యాడీ'ని రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాను ఆయన కూతురు సుస్మిత కొణిదెల నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఈ నెలలో రానుందట.

Tags:    

Similar News