స్త్రీ 2 మూవీ.. ఇది ఎవరూ ఊహించని రికార్డు..

ఆరేళ్ల క్రితం విడుదలైన స్త్రీ మూవీ సీక్వెల్ గా వచ్చిన స్త్రీ 2కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది

Update: 2024-08-17 13:15 GMT

స్త్రీ 2.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా కోసమే చర్చ నడుస్తోంది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మేకర్స్ వదిలేసిన ఆగస్టు 15వ తేదీన విడుదలైన స్త్రీ 2 అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. విడుదలైన రెండు రోజులకే రూ.100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టి సత్తా చాటుతోంది.

ఆరేళ్ల క్రితం విడుదలైన స్త్రీ మూవీ సీక్వెల్ గా వచ్చిన స్త్రీ 2కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ పార్ట్ కు మించిన స్పందన అందుకుంటోంది. తొలి పార్ట్ కంటే ఈసారి కామెడీ, యాక్షన్, డ్రామాను డబుల్ గా ఉండటంతో అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుని రానిస్తోంది. వరుస సెలవులు, వీకెండ్ కలిసి రావడంతో థియేటర్లకు సినీ ప్రియులు క్యూ కడుతున్నారు. అనేక సెంటర్లలో హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి.

రెండు రోజులకు ఏకంగా రూ.118 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన స్త్రీ మూవీపై రిలీజ్ కు ముందే మంచి బజ్ క్రియేట్ అవ్వడంతో ప్రీమియర్స్ వేశారు మేకర్స్. ప్రీమియర్ల ద్వారా 9.5 కోట్ల రూపాయలు రాబట్టిన చిత్రం.. తొలిరోజు రికార్డు స్థాయిలో రూ.55.4 కోట్లు వసూలు చేసింది. దీంతో బీ టౌన్ లో ఆల్ టైమ్ హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన టాప్-5 చిత్రాల జాబితాలోకి చేరిపోయింది. రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఫస్ట్ ప్లేస్ లో షారుక్ ఖాన్ జవాన్ ఉంది.

స్త్రీ2 తర్వాత పఠాన్, యానిమల్, కేజీఎఫ్-2 చిత్రాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆస్తకికరమైన విషయమేమిటంటే.. టాప్-5లో ఉన్న స్త్రీ2 తప్ప మిగతా నాలుగు కూడా యాక్షన్ మూవీలే. స్త్రీ 2 మూవీ మాత్రం ఆ నాలుగు చిత్రాలకు భిన్నంగా తెరకెక్కింది. కామెడీ హారర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రంలో లవ్ ఎలిమెంట్ కూడా ఉంది. అలా అన్ని అంశాలతో విపరీతంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.

ఇంకో విషయమేమింటే.. పఠాన్, జవాన్, కేజీఎఫ్-2, యానిమల్ పాన్ ఇండియా లెవెల్ లో వివిధ బాషల్లో రిలీజ్ అయ్యాయి. కానీ స్త్రీ 2 కంప్లీట్ హిందీ మూవీగా రిలీజైంది. దాంతోపాటు మీడియం రేంజ్ యాక్టర్స్ రాజ్‌ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ వంటి పలువురు నటించిన ఈ చిత్రం.. అంతటి రికార్డు సాధించిందంటే గొప్ప విషయమని చెప్పాలి. మూవీ ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేలోపు.. రూ.1000 కోట్లు సాధించడం పక్కా అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News