VD12 : ఆ సీన్‌ అద్భుతంగా వచ్చిందట!

స్టంట్స్‌ డైరెక్టర్‌ చేతన్‌ రాంషి డిసౌజా ఇటీవల ఒక చిట్‌చాట్‌ లో మాట్లాడుతూ అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్ ను షూట్‌ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.

Update: 2024-10-22 02:53 GMT

విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాను దిల్‌ రాజు నిర్మించాడు. మృణాల్ ఠాకూర్‌ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. యూత్‌ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను ఎంజాయ్‌ చేస్తారంటూ మేకర్స్ బలంగా చెప్పారు. కానీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడింది. సినిమాకు సంబంధించిన వసూళ్లు తీవ్రంగా నిరాశ పరచడం తో విజయ్ దేవరకొండ తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చాలా కష్టపడుతున్నాడని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మిస్టర్ బచ్చన్‌లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మున్నార్‌లోని అందమైన లొకేషన్స్‌లో సినిమా చిత్రీకరణ చేస్తున్నట్లుగా మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది. స్టంట్స్‌ డైరెక్టర్‌ చేతన్‌ రాంషి డిసౌజా ఇటీవల ఒక చిట్‌చాట్‌ లో మాట్లాడుతూ అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్ ను షూట్‌ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఛాలెంజింగ్ యాక్షన్‌ సీక్వెన్స్‌లో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నట్లుగా చేతన్ చెప్పుకొచ్చాడు.

విజయ్‌ను విభిన్నమైన పాత్రలో దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి చూపించబోతున్నాడని, ఆయన కెరీర్‌లో ఇది బెస్ట్‌ సినిమాగా ఉంటుందని సైతం చేతన్‌ పేర్కొన్నాడు. విజయ్ దేవరకొండకు జోగీగా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో టాలీవుడ్‌ లో బిజీ హీరోయిన్‌గా మారడం ఖాయం అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. గూఢచారి నేపథ్యంలో టాలీవుడ్‌ నుంచి రాబోతున్న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నెట్టింట ఈ సినిమా గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇప్పటి వరకు టైటిల్‌ ప్రకటించని ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ ను ఖరారు చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో వచ్చే ఏడాది మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు తమిళ స్టార్‌ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన సంగీతం అందించిన దేవర సినిమా మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. అంతే కాకుండా సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విజయ్ దేవరకొండకు ఈ సినిమా విజయం అత్యంత కీలకం. అందుకే ప్రతి సన్నివేశం కు చాలా కష్టపడుతున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Tags:    

Similar News