సల్మాన్ ని బిష్ణోయ్ వదలనట్లు జాకీని సుకేష్ వదలడం లేదే!
బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ని వదలనట్లు! జాక్వెలిన్ పెర్నాండేజ్ ని కాన్ మాన్ సుకేష్ చంద్ర వదిలే కనిపించ లేదు.
బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ని వదలనట్లు! జాక్వెలిన్ పెర్నాండేజ్ ని కాన్ మాన్ సుకేష్ చంద్ర వదిలే కనిపించ లేదు. సల్మాన్ ఖాన్ మీద లారెన్స్ కక్ష పెంచుకుంటున్నట్లే? జాకీపై సుకేష్ అంతకంతకు ప్రేమను పెంచు కుంటున్నాడు. దూరం పెరిగే కొద్ది అది భారంగా మారుతుందంటారు. ఇప్పుడా భారాన్ని జాకీ విషయంలో సుకేష్ మోస్తున్నాడు. తాజాగా మాజీ ప్రేయసికి సుకేష్ దీపావళి సందేశం పంపించాడు.
బేబి మన ప్రేమ కథదేనికి తక్కువ కాదు. వనవాసాన్ని పూర్తి చేసుకుని త్వరలోనే వస్తాను. నీ పారిస్ టూర్ ఫొటోలు బాగున్నాయి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను పిచ్చివాడినని ప్రపంచం అనుకోవచ్చు. కానీ మన మధ్య ఏముందో ప్రపంచానికి తెలుసు. మన ప్రేమకథ ప్రపంచానికి ఒక ఉదాహరణ కావాలి` అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సుకేష్ చంద్ర ...జాకీపై ఎంత ప్రేమను పెంచుకున్నాడు? అన్నది మరోసారి అద్దం పట్టింది.
ఈ సందేశానికి ముందే జాకీ ఆల్బం స్మార్ట్ రైడర్ ని ఎక్కువగా విన్న వాళ్లకు రకరకాల బహుమతులు ఇస్తానని సుకేష్ ప్రకటించి ఆల్బమ్ ని తనదైన శైలిలో ప్రమోట్ చేసాడు. జాకీ కోరకుండానే ఇలా చేసి తన సక్సెస్ లో భాగమయ్యాడు. మనీలాండరింగ్ కేసులో జైలుకెళ్లిన తర్వాత జాక్వెలిన్ పెర్నాండేజ్ ఆ కేసులో విచారణ ఈడీ విచారణ ఎదుర్కున్న సంగతి తెలిసిందే.
జాకీతో తనకున్న రిలేషన్ షిప్ గురించి అధికారులకు పూస గుచ్చి చెప్పి కేసు నుంచి బయట పడే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత సుకేష్ ఎటాకింగ్ మొదలు పెట్టాడు. జైలు నుంచి తమ మధ్య ఉన్న బంధాన్ని రివీల్ చేస్తూ లేఖలు రాయడం...ప్రేమ రాయబారాలు పంపడం చేసాడు. ఇప్పటికీ ఆ పరంపర యధావిధిగా కొనసాగిస్తున్నాడు. అందులో భాగమే ఆ దివాలీ సందేశం.