సుకుమార్ రిస్క్ ఎందుకు తీసుకోలేకపోతున్నాడు?
సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు రెండవ సినిమాకి దేవి శ్రీని పక్కనబెట్టేసిన సంగతని గుర్తు చేస్తున్నారు.
క్రియేటివ్ మేకర్ సుకుమార్ రిస్క్ ఎందుకు తీసుకోలేకపోతున్నాడు? రిస్క్ అంటే ఆయనకు అంత భయమా? ఆయనిక ఆ క్రాప్ట్ లో కొత్తగా ట్రై చేసే అవకాశమే లేదా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. తాజాగా ఆర్సీ 17వ చిత్రాన్ని సుకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. `రంగస్థలం` తర్వాత చరణ్-సుక్కు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రమిది. అయితే ఈసినిమాకి కూడా మళ్లీ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడిదే అంశం నెట్టింట నెటి జనుల్లో చర్చకు దారి తీస్తోంది.
సుకుమార్ ఇక దేవికి బాండ్ అయిపోయాడా? కొత్త సంగీత దర్శకుడిని తీసుకోడా? కొత్తగా ట్రై చేయడా? ఎన్నాళ్లీ బోరింగ్ కాంబినేషన్ అంటూ? అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ ఇప్పటి వరకూ ఏడు సినిమాలు తెరకెక్కించారు. తొలి సినిమా `ఆర్య`కి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఆ తర్వాత `జగడం`.. `ఆర్య-2`..`100 పర్సంట్ లవ్`..`నేనొక్కడినే`..`రంగస్థలం`..`పుష్ప ది బినిగింగ్` చిత్రాలన్నింటికీ కూడా దేవి శ్రీనే పనిచేసాడు. ప్రస్తుతం సెట్స్ లో ఉన్న `పుష్ప-2`కి కూడా దేవి శ్రీనే సంగీతం అందిస్తున్నాడు.
తాజాగా చరణ్ సినిమాకి కూడా దేవినే ఫైనల్ చేయడం విశేషం. దీంతో సుకుమార్ సంగీతంలో కొత్తగా ఎందుకు ట్రై చేయడం లేదు? ఇద్దరిది సక్సస్ పుల్ కాంబినేషన్ అయినా? ఆబాధ్యత తనది కాదని భావించి ఇలా చేస్తున్నాడా? లేక దేవి శ్రీ తప్ప ఇంకెవ్వరూ సంగీతానికి న్యాయం చేయలేరని భావిస్తు న్నాడా? లేక అసలు సంగీత దర్శకులే లేరని ఆయన ఆలోచనలా? ఉన్నాడా? అంటూ రకరకాల సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు రెండవ సినిమాకి దేవి శ్రీని పక్కనబెట్టేసిన సంగతని గుర్తు చేస్తున్నారు. బుచ్చిబాబు తొలి సినిమా `ఉప్పెన`కి దేవి శ్రీనే మంచి సంగీతం అందించాడు. మ్యూజికల్ గా ఆ సినిమాని ముందే హిట్ చేసాడు. కానీ అదే బుచ్చిబాబు రెండవ సినిమా రామచరణ్ కోసం ఏకంగా రెహమాన్ నే దించాడు. రెహమాన్ గత సక్సెస్ లు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆ లెజెండరీని లాంచింగ్ కి సైతం తీసుకొచ్చాడు. అలా సంగీతంలో బుచ్చిబాబు ఛేంజ్ కోరుకున్నాడు. మరి ఇలా గురువు ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు? అన్నది అర్ధంకానీ ప్రశ్నగా కనిపిస్తుంది.