పుష్ప 2 : భారీ యాక్షన్ కి సుక్కు భలే ప్లానింగ్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసి ఆగస్టు 15న విడుదల చేయాలని భావించినప్పటికీ అనుకున్నంత స్పీడ్ గా షూటింగ్ జరగలేదట. అందుకే సినిమాను డిసెంబర్ కు వాయిదా వేసిన విషయం తెల్సిందే.
తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ యాక్షన్ సన్నివేశంను సుకుమార్ ప్లాన్ చేశాడట. ఆ సన్నివేశం షూటింగ్ కు దాదాపుగా 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
అన్ని రోజుల పాటు షూటింగ్ కు అందరి డేట్లు కావాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అంతే కాకుండా కాస్త అటు ఇటు అయినా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే భారీ యాక్షన్ సీక్వెన్స్ కనుక పూర్తిగా డమ్మీ ఆర్టిస్టులను పెట్టి షూట్ చేయబోతున్నారట.
నిజమైన ఆ యాక్షన్ సన్నివేశం ఎలా ఉంటుందో అలాగే ఈ డమ్మీ యాక్షన్ సన్నివేశం ఉంటుందట. ఆ డమ్మీ యాక్షన్ సన్నివేశం ఎలా వచ్చిందో చూసి, దాంట్లోని లోపాలను గుర్తించి ఆ తర్వాత రియల్ నటీ నటులతో షూటింగ్ కి వెళ్లబోతున్నారట.
మొత్తానికి సుకుమార్ ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం వేసిన ప్లాన్ భలే ఉందంటూ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు విషయం తెలిసిన ఇండస్ట్రీ వర్గాల వారు చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ ఇంత పర్‌ఫెక్ట్ గా, ప్లాన్ చేసుకుంటాడు కనుకే పుష్ప తో పాటు అంతకు ముందు సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.
ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయాన్ని నమోదు చేయడం ఖాయం అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు రికార్డు స్థాయి బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెయ్యి కోట్ల టార్గెట్ తో ఈ సినిమా రాబోతుంది.