ఎర్రకోక స్లీవ్ లెస్ బ్లౌజ్లో తాప్సీ హొయలు
తాప్సీ ఇటీవలే బోయ్ ఫ్రెండ్ మాథ్యూస్ బోని సీక్రెట్ గా పెళ్లాడి సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చింది.
గట్సీ ఎంపికలతో బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ పన్ను. డుంకీ, నామ్ షబానా, బద్లా, శభాష్ మిత్తు వంటి సినిమాల్లో తన అద్భుత నటనతో ఆకట్టుకుంది. మల్టీ ట్యాలెంటెడ్ నటి అని నిరూపించుకుంది. తాప్సీ ఇటీవలే బోయ్ ఫ్రెండ్ మాథ్యూస్ బోని సీక్రెట్ గా పెళ్లాడి సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చింది.
అయితే తాప్సీ ఆగస్ట్ నెల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఆగస్ట్‌లో తనకు అద్భుతమైన చిత్రాల లైనప్ ఉంది. అది కూడా తన పుట్టినరోజు నెల. తాప్సీ ప్రస్తుతం ఫిర్ ఆయీ హస్సేన్ దిల్రూబా , ఖేల్ ఖేల్ మే చిత్రాల్లో నటిస్తోంది. తన పుట్టినరోజు నెలలోనే ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సందర్భంగా తాజా ప్రమోషన్స్ లో తాప్సీ ఆగస్టుపై ఎనలేని ప్రేమను కనబరుస్తోంది. ప్రచారంలో ఆగస్టును తెగ హైలైట్ చేసేస్తోంది.
అంతేకాదు సోషల్ మీడియాల్లో స్పెషల్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ తన సినిమాలను కూడా అదే పనిగా ప్రమోట్ చేసుకుంటోంది. తాజాగా తాప్సీ షేర్ చేసిన అందమైన ఎర్రకోక రవికె ఫోజ్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఈ డిజైనర్ శారీలో తాప్సీ ఎంతో అందంగా కనిపిస్తోంది. ఫోటోషూట్ బ్యాక్ గ్రౌండ్ లో కళంకారి ఆర్ట్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అలాగే తాప్సీ పన్ను ఎర్ర చీర.. స్లీవ్ లెస్ బ్లౌజు.. గిరజాల జుత్తు.. కాలికి తాయత్తు కూడా ప్రత్యేకంగా హైలైట్ అయ్యాయి. మునుపటి కంటే తాప్సీ చాలా స్లిమ్ గాను కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
ఖేల్ ఖేల్ మే, ఫిర్ ఆయీ హస్సేన్ దిల్రూబా ఈ రెండూ దేనికదే భిన్నమైన కంటెంట్ తో వస్తున్నవి. వీటిలో తన పాత్రలు కూడా వైవిధ్యంగా ఉంటాయని తెలిసింది. ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా ఆగస్టు 9న విడుదల కానుండగా, ఖేల్ ఖేల్ మే ఆగస్టు 15న విడుదల కానుంది. అందువల్ల ఆగస్టు కోసం ఉత్సాహం ఎదురుచూస్తోంది. ఫిర్ ఆయీ హస్సేన్ దిల్రూబా, ఖేల్ ఖేల్ మేతో పాటు, వో లడ్కీ హై కహాన్‌లో కూడా అందాల తాప్సీ కనిపించనుంది.