నైట్ డ్రెస్సులో తాప్సి.. వావ్ అనేలా..
రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో నైట్ డ్రెస్ లో దిగిన ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో తాప్సి తన గ్లామర్ ను ఎలివేట్ చేస్తూ, లెగ్స్ అందాలతో స్టన్ అయ్యేలా కనిపించింది.
తాప్సి పన్ను, ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగి, ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది. తెలుగులో రానా దగ్గుబాటి సరసన 'జుమ్మందినాదం'తో తన కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ, ఆ తర్వాత 'మిస్టర్ పర్ఫెక్ట్', 'గుండెల్లో గోదారి', 'సాహసం' లాంటి సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారింది.
ఇటీవల బాలీవుడ్ వైపు అడుగులేసిన తాప్సి, అక్కడ మొదట్లో వరుస హిట్లతో బిజీ బిజీగా కనిపించింది. కానీ ఇటీవల మళ్ళీ బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ వచ్చాయి. అయితే ఆమె చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాయి. ప్రత్యేకంగా 'పింక్', 'తప్పడ్' వంటి చిత్రాలతో ఆమె నటనను అందరూ ప్రశంసించారు.
ఇక సౌత్ సినిమాలకు దూరమైనా, తాప్సి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ, తన అభిమానులకు ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ లు ఇస్తుంది. రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో నైట్ డ్రెస్ లో దిగిన ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో తాప్సి తన గ్లామర్ ను ఎలివేట్ చేస్తూ, లెగ్స్ అందాలతో స్టన్ అయ్యేలా కనిపించింది.
ఈ ఫోటోలు షేర్ చేసిన గంటలోనే లక్షలాది లైక్స్ రావడం విశేషం. తాప్సి ఇన్స్టాగ్రామ్ లో 20.6 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు, ఈ పిక్ ను చూసి అందరూ వావ్ అంటున్నారు. తాప్సి తన కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ సినిమాల్లో రాణించగా, ఇప్పుడు బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ మధ్య తాప్సి ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండీ ఫోటో షూట్ లతో సందడి చేస్తోంది.
తాప్సి గ్లామర్ కే ఫిదా అయిన అభిమానులు ఆమె ఫోటోలకు లక్షల లైక్స్ కురిపిస్తున్నారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది. సౌత్ సినిమాలలో కూడా నటించాలని ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రావడం లేదు. మరి రాబోయే రోజుల్లో తాప్సి ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.