దేశాన్ని ఊపేసిన ఘటనలో తమన్నా!
వాస్తవ సంఘటనల్లో నటించే ఛాన్స్ ఎప్పుడో? గానీ రాదు.
వాస్తవ సంఘటనల్లో నటించే ఛాన్స్ ఎప్పుడో? గానీ రాదు. అందులోనూ మహిళా నటులకు అలాంటి అవకాశాలు చాలా రేర్ గా వస్తాయి. వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుని సక్సెస్ అవ్వడమే. ప్రస్తుతం అలాంటి ఓ ఘటనలో అనుష్క శెట్టి మెయిన్ లో లీడ్లో క్రిష్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇది దేశాన్ని కుదిపేసిన సంఘటన అని అంటున్నారు. ఇప్పటి వరకూ ఎక్కువగా భాగం ఒరిస్సాలో జరగడం వివేషం.
దీంతో ఆరాష్ట్రానికి సంబంధించిన ఘటనగా ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అలాంటి ఘటనతోనే ఓ సిరీస్ చేస్తున్నట్లు వెలుగులోకి వస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ముందుకు రావడం విశేషం. ఆయనతో కలిసి ప్రీతీ సీమోస్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్నిప్రీతీ ఇన్ స్టా వేదికగా రివీల్ చేసింది.
గతంలో తమన్నా-ప్రీతీ కాంబినేషన్ లో `ఆఖరి సచ్` అనే ఇన్వస్టిగేషన్ థ్రిల్లర్ ఒకటొచ్చింది. అది మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆ జోడీ చేతలు కలిపింది. దేశమంతా ఉలిక్కి పడే ఘటనతో వస్తున్నామంటూ విషయం రివీల్ చేసింది. ఇందులో తమన్నా న్యాయవాది పాత్ర పోషిస్తుందని సమాచారం. ఇలాంటి పాత్రలో తమన్నా ఇంతవరకూ నటించలేదు.
గ్లామర్ పాత్రల్లోనే హైలైట్ అయింది. కొన్ని వైవిథ్యమైన పాత్రలు పోషించింది. కానీ నల్లకోటు వేసుకుని న్యాయం కోసం వాధించే అవకాశం రాలేదు. కరణ్ -ప్రీతీ ఛాన్స్ తో అది సాధ్యమైంది. మరి తమన్నా లో సిసలైన నటిని తట్టి లేపాల్సిన సమయం అసన్నమైంది. తమన్నా అంటే గ్లామర్ పాత్రలు...హాట్ అప్పిరియన్స్, ఐటం పాటలే గుర్తొస్తాయి. అందుకు పూర్తి భిన్నమైన పాత్ర ఇప్పుడు పోషిస్తుంది. తమన్నా వెయిట్ పెంచే రోల్ ఇది అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా `ఓదెల-2` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.