రిలీజ్ కంటే తమన్నా తోనే ఎక్కువ టెన్షన్!
తమన్నా అంటే? ఎంత ఇష్టమో విజయ్ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. తన ప్రాణ సమానంగా తమన్నాని ప్రేమిస్తున్నాడు
తమన్నా-విజయ్ వర్మ మధ్య ప్రేమ పీక్స్ లో నడుస్తోన్న సంగతి తెలిసిందే. తమన్నా అంటే? ఎంత ఇష్టమో విజయ్ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. తన ప్రాణ సమానంగా తమన్నాని ప్రేమిస్తున్నాడు. ఉన్నంత కాలం రహాస్యంగా దాచినా ఓపెన్ అయిన నాటి నుంచి మాత్రం తన ప్రేమ మొత్తాన్ని చాటడం మొదలు పెట్టాడు. ప్రేమ గురించి అడగాలే గానీ? మరో ఆలోచన లేకుండా ఎంతో ఓపెన్ గా మాట్లాడు తున్నాడు.
అతడి మాటల్ని బట్టి తమన్నాని ఎంతగా ప్రేమిస్తున్నాడన్నది అద్దం పడుతుంది. తమన్నాని విజయ్ వర్మ కంటే గొప్పగా మరొకరు ప్రేమించలేరేమో! అన్న ఆలోచన కూడా నెటి జనులకు వచ్చేస్తోంది ఆజంట మధ్య అన్యోన్యతతని చూస్తుంటే? తాజాగా విజయ్ మరోసారి తమన్నా ప్రేమలో నెటి జనుల్ని ముంచే సాడు. `తొలిసారి ఇద్దరి డేటింగ్ గురించి జనాలకు తెలియడంతో ఆశ్చర్యపోయాను. నాకు ఇది ఒక షాక్ లా అనిపించింది.
`షాక్ లగా కీ ఇత్నా లోగోన్ కో ఇంట్రెస్ట్ హై`. కానీ తర్వాత నెమ్మదిగా ఆ షాక్ నుంచి బయటకు వచ్చాను. `పెహ్లే ఐసా లగా కి మేరీ ఫిల్మ్ రిలీజ్ సే బడి న్యూస్ హై`. ఇలాంటి వాటిని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు? అనే టెన్షన్ ఉండేది. కానీ వాళ్లకి అన్నీ తెలుసని అర్దమైంది. మొదట్లో నా సినిమా విడుదల కావడం కంటే ఇదే పెద్ద వార్తగా భావించేవాడిని. తమన్నాతో నా బాండింగ్ ఎంతో బలమైనది. మనో హరమైనది.
మాజీవితాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నాం. హైదరాబాద్ నుంచి నేను ముంబై వెళ్లడం ...తమన్నా ముంబై నుంచి హైదరాబాద్ వెళ్లడం ఇద్దరం కలవడం అంతా చాలా సర్ ప్రైజ్ గా అనిపిస్తుంది. `ఏక్ హాయ్ టైమ్ పర్ హమ్ లాగ్ క్రాస్ హ్యూ ఏక్ దూస్రే `. తమన్నా ముంబై అయినా తెలుగు, తమిళ భాషలు ఎంతో చక్కగా మాట్లాడుతుంది. లస్ట్ స్టోరీస్ 2 తో పరిచయమైంది. ఆ సిరీస్ షూటింగ్ తర్వాత రిలేషన్ షిప్ మొదలైంది. సెట్స్ లో ఎంతో ప్రోపెషనల్ గా ఉండేవాళ్లం. డేట్ కి వెళ్లడానికి 20-25 రోజులు సమయం పట్టింది` అని అన్నాడు.