కోలీవుడ్ లో కల్కి పరిస్థితేంటి?

దీంతో తమిళనాడులో కల్కి సినిమాకు పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి అలా లేదు. ఊహించని స్థాయిలో ప్రీ బుకింగ్స్ అక్కడ జరగలేదు.

Update: 2024-06-25 06:51 GMT

ప్రస్తుతం సినీ ప్రియుల వెయిటింగ్ అంతా పాన్ ఇండియా ఫిల్మ్ కల్కి 2898 ఏడీ కోసమే. స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై వేరే లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. యాక్షన్, విజువల్స్, గ్రాఫిక్స్, ఎమోషన్స్.. అలా అన్నింటితో ఆడియన్స్ ను వేరే లోకంలోకి మూవీ తీసుకెళ్లడం పక్కా అని తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మంచి బిజినెస్ జరుపుకున్న విషయం తెలిసిందే.

తెలుగుతోపాటు హిందీ, తమిళంలో కూడా గ్రాండ్ గా కల్కి మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కల్కి తమిళనాడు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న శ్రీలక్ష్మి మూవీస్ సంస్థ.. రూ.22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు రూ.40 కోట్లకుపైగా గ్రాస్ ను కల్కి అక్కడ వసూలు చేయాలి. అప్పుడే కోలీవుడ్ లో క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

అయితే ప్రభాస్ నటించిన బాహుబలి సిరీస్ సినిమాలు.. తమిళనాడులో మంచి వసూళ్లు రాబట్టాయి. ఆ తర్వాత ఆయన చేసిన ఆదిపురుష్, సలార్ చిత్రాలు అనుకున్న స్థాయిలో రానించలేదు. సలార్ రూ.20 కోట్లకుపైగా మాత్రమే రాబట్టింది. కానీ ఇప్పుడు డీసెంట్ టార్గెట్ తో కల్కి రిలీజ్ అవుతున్నా.. సినిమాలో కమల్ హాసన్ నటిస్తుండడంతో మంచి హోప్స్ ఉన్నాయి. ట్రైలర్ లో కమల్ రోల్ యాస్కిన్ కు వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది.

దీంతో తమిళనాడులో కల్కి సినిమాకు పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి అలా లేదు. ఊహించని స్థాయిలో ప్రీ బుకింగ్స్ అక్కడ జరగలేదు. నిన్నటి రోజున చూసుకుంటే.. 15% ఆక్యుపెన్సీతో రూ.50 లక్షల గ్రాస్ మాత్రమే వసూలు అయింది. బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే కోలీవుడ్ ఆడియన్స్.. కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ పై అంతగా ఇంట్రెస్ట్ చూపించినట్లు కనిపించడం లేదు.

అయితే విలక్షణ నటుడు కమల్ హాసన్, మరో స్టార్ యాక్టర్ పశుపతి, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్.. మూవీ టీమ్ లో ఉన్నా ప్రీ బుకింగ్స్ తక్కువ జరగడం గమనార్హమే. కానీ సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కల్కి దూసుకుపోతుందనే నమ్మకం అందరిలో ఉంది. రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రీ బుకింగ్స్ పెరుగుతాయని అంటున్నారు. ఏదైనా.. ప్రీ బుకింగ్స్ కాదు.. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే చాలు.. మూవీ ఎక్కడైనా దూసుకుపోవడం పక్కా!

Tags:    

Similar News