సుగాలి ప్రీతి హ‌త్య కేసు.. ప‌వ‌న్‌కి త‌మ్మారెడ్డి ప్ర‌శ్న‌

ఉన్న‌దున్న‌ట్టు ముక్కు సూటిగా మాట్లాడే వ్య‌క్తి త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌. ఆయ‌న‌ ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా సుప్ర‌సిద్ధుడు. సినీ కార్మిక స‌మాఖ్య అధ్య‌క్షుడిగాను ప‌ని చేసారు.

Update: 2025-02-18 10:01 GMT

ఉన్న‌దున్న‌ట్టు ముక్కు సూటిగా మాట్లాడే వ్య‌క్తి త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌. ఆయ‌న‌ ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా సుప్ర‌సిద్ధుడు. సినీ కార్మిక స‌మాఖ్య అధ్య‌క్షుడిగాను ప‌ని చేసారు. తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ సుగాలి ప్రీతి కేసు ఏమైంద‌ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. ఈ కేసుపై త‌న అభిప్రాయాల‌ను త‌మ్మారెడ్డి సూటిగా తెలిపారు.

2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సుగాలి ప్రీతి హత్య కేసును ప్ర‌భుత్వ అధినాయ‌కులు తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని 2019, 2024అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించారని.. అయితే ఎల‌క్ష‌న్ అయిపోయాక ఆ కేసును ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఇలాంటి కేసులు ఇక మీదట ఉండ‌బోవ‌ని ప‌వ‌న్ హామీ ఇచ్చారు. కానీ ఆయ‌న తీసుకున్న చ‌ర్య‌లేమిటో తెలియ‌ద‌ని, వాటిని వెల్లడించాల‌ని త‌మ్మారెడ్డి డిమాండ్ చేసారు.

వైయ‌స్ జ‌గన్ పాల‌న‌లోను ఈ కేసులో పురోగ‌తి లేద‌ని, దోషుల‌ను ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న ఆన్నారు. సీబీఐ త‌మ‌కు స‌రిప‌డినంత స్టాఫ్ లేక విచార‌ణ సాగ‌లేద‌ని చెబుతోంది. ఏపీలో 30 వేల మహిళలు, బాలికలు మిస్సింగ్ అయ్యారని పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ వారి విషయంలో కూట‌మి అధికారంలోకి వచ్చాకా ఏం చేశారని తమ్మారెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మహిళల భద్రతపై స్పందించడం లేద‌ని అన్నారు. ఉప ముఖ్య‌మంత్రి పవన్ హామీల‌ మేరకు మహిళల భద్రతపైన, సుగాలి ప్రీతి కేసుపైన దృష్టి సారించాల‌ని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News