భారతీయుడు 2: టిక్కెట్ల రేట్లు ఎంత పెంచుతున్నారంటే..
ఇందులో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో 100 ఏళ్ళు పైబడిన వృద్ధుడిగా కనిపించి, విలన్లతో భారీ యాక్షన్ సీన్స్ లో పాల్గొంటారు.
కమల్ హాసన్ మరియు శంకర్ కాంబినేషన్ లో రూపొందిన భారతీయుడు 2 సినిమా జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారతీయుడు సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా, కమల్ హాసన్ ఫ్యాన్స్ తో పాటు మొత్తం సినిమా ప్రేక్షకులు భారీగా ఎదురుచూస్తున్న సినిమా. ఇందులో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో 100 ఏళ్ళు పైబడిన వృద్ధుడిగా కనిపించి, విలన్లతో భారీ యాక్షన్ సీన్స్ లో పాల్గొంటారు.
ఇక చిత్రం ట్రైలర్ విడుదలతోనే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. కమల్ హాసన్ ఇటీవల విడుదలైన కల్కి 2898ఏడీ సినిమాలో ప్రతినాయకుడిగా చేసిన పాత్రకూ మంచి స్పందన వచ్చింది. ఈ హైప్ భారతీయుడు 2కు కూడా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక సినిమా ఇప్పుడు డీసెంట్ టార్గెట్ తో తెలుగులో కూడా గ్రాండ్ గా విడుదల అవుతోంది.
ఇక ఎలాంటి సినిమా అయినా సరే ముఖ్యంగా పెద్ద సినిమాలు టిక్కెట్ల రేట్లు, ఆదనపు షోలు అవసరం పడితే డ్రగ్స్ నిర్ములనపై మద్దతు తెలుపుతూ వీడియోల ద్వారా సందేశాలు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండియన్ 2 మూవీ టీమ్ కూడా ఆ విధంగా అడుగులు వేయడంతో తెలంగాణ ప్రభుత్వం నుంచి రెండు ఆఫర్స్ అయితే వచ్చాయి.
తెలంగాణ ప్రభుత్వం నైజాంలో టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. మల్టీప్లెక్స్ థియేటర్స్ లలో ప్రస్తుతం ఉన్న టిక్కెట్ల రేట్ల కంటే 75 రూపాయలు అదనంగా పెంచనున్నారు. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లలో 50 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కలిగించారు. అదనంగా రోజుకు 5 షోలకు పర్మిషన్ కూడా లభించింది. మొదటి 7 రోజులు ఈ తరహాలో సినిమా కొనసాగనుంది.
భారతీయుడు 2 సినిమాకు తెలుగులో 25 కోట్ల బిజినెస్ జరిగింది. ఇది బిజినెస్ పరంగా తక్కువగానే అనిపిస్తుంది. కానీ, సినిమా పాజిటివ్ టాక్ అందుకున్నచో ఈ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ సులభంగా చేరుకోవచ్చు. కమల్ హాసన్ ఇమేజ్, శంకర్ డైరెక్షన్, మరియు సినిమా ట్రైలర్ రేంజ్ చూసినప్పుడు, సినిమాపై భారీగా ప్రేక్షకులు రప్పించే అవకాశం ఉంది. సినిమాలో నటించిన సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా వంటి యాక్టర్స్ కూడా తెలుగులో మంచి క్రేజ్ కలిగిన వారు. ఇది కూడా సినిమాకు కలిసొచ్చే అంశం.