దళపతి స్పీడ్ మెచ్చుకోవాల్సిందే..!
టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోని తీసుకున్నా సినిమా మొదలు పెట్టారంటే కనీసం రెండేళ్లు తీసుకోనిదే రిలీజ్ చేయలేరు
టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోని తీసుకున్నా సినిమా మొదలు పెట్టారంటే కనీసం రెండేళ్లు తీసుకోనిదే రిలీజ్ చేయలేరు. అది పరిస్థితుల ప్రభావం కావొచ్చు.. సినిమా షూటింగ్ లేట్ కావొచ్చు.. కారణం ఏదైనా సినిమా ముహూర్తానికి రిలీజ్ డేట్ కి రెండేళ్లు తక్కువ గ్యాప్ లేకుండా చూసుకుంటారు. సినిమా బడ్జెట్ పెరిగేందుకు కారణమైన వాటిల్లో ఇది కూడా ఒకటి. అయితే మన వాళ్లు తీసేది పాన్ ఇండియా సినిమాలు కాబట్టి ఆ మాత్రం బడ్జెట్.. ఆ మాత్రం వెయిటింగ్ తప్పదని అనుకుంటారు.
కానీ ఇక్కడ విషయం ఏంటంటే బడ్జెట్ ఎక్కువ పెట్టినా తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేస్తే కొంతలో కొంత సేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ని తప్పకుండా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన సినిమాలు స్పీడ్ స్పీడ్ గా చేసేస్తాడు. వాటి కలెక్షన్స్ కూడా 200 కోట్లకు దాటేలా చేసుకుంటాడు.
కోలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ లాస్ట్ ఇయర్ లియో సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. ఇక ఆ వెంటనే వెంకట్ ప్రభు డైరెక్షన్ లో గోట్ అనౌన్స్ చేశాడు. సినిమా లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో మొదలవగా సగానికి పైగా షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
సినిమా సినిమాకు ఏమాత్రం గ్యాప్ లేకుండా.. సినిమా పూర్తి చేసేందుకు కూడా 8 నుంచి 10 నెలలు మాత్రమే పట్టేలా చూస్తున్నాడు విజయ్. సినిమా మొదలు పెడితే పూర్తి చేసేంతవరకు కృషి చేస్తుంటాడు. అయితే ఈ విషయంలో మన స్టార్స్ కూడా బెస్టే అని చెప్పొచ్చు. సినిమాకు ఎంత ఇవ్వాలో దానికి ఇంకా ఎక్కువే ఇచ్చేస్తుంటారు. సినిమా కోసం కష్టపడటంలో అందరు సమానమే కానీ సినిమాను త్వరగా పూర్తి చేయాలనే ఆలోచన కూడా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు.
ఎవరెలా ఉన్నా దళపతి విజయ్ మాత్రం సినిమా మొదలు పెట్టామా ఆరు ఏడు నెలల్లో పూర్తి చేశామా రిలీజ్ చేశామా హిట్ కొట్టామా.. మళ్లీ వెంటనే సినిమా మొదలు పెట్టామా అన్న తీరులో సినిమాలు చేస్తున్నాడు. దళపతి విజయ్ లో ఉన్న ఈ ఒక్క స్పెషల్ క్వాలిటీ సినీ లవర్స్ ని ఆయన్ను ప్రత్యేకంగా అభిమానించేలా చేస్తుంది.