పెళ్లి జరిగిన నెలలోపే మరొకసారి పెళ్లి చేసుకున్న శాండల్‌వుడ్ డైరక్టర్..

శాండల్‌వుడ్ నటుడు-దర్శకుడు తరుణ్ సుధీర్, నటి సోనాల్ మాంటిరోను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-03 15:30 GMT

శాండల్‌వుడ్ నటుడు-దర్శకుడు తరుణ్ సుధీర్, నటి సోనాల్ మాంటిరోను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సాంప్రదాయ బద్ధంగా బెంగళూరులోని పూర్ణిమ ప్యాలెస్ లో ఆగస్టు 11న వీరిద్దరి వివాహం జరిగింది. ఈ పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

శివరాజ్‌కుమార్, గణేష్, శరణ్, జగపతి బాబు, ప్రేమ్, అవినాష్, తార, గిరిజా లోకేష్, శృతి, మేఘనా రాజ్, మేఘా శెట్టి, రచితా రామ్, సుధారాణి, నిస్వికా నాయుడు, పద్మరాజ్ రావు, మాళవిక, దొడ్డన్న, గాయకుడు విజయ్ ప్రకాష్, సంగీత దర్శకులు హంసలేఖ సహా నటీనటులు , హరికృష్ణ, సాధు కోకిల సహా పలువురు సెలబ్రిటీలు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అయితే ఈ పెళ్లికి దర్శన్ మాత్రం హాజరు కాలేకపోయాడు అని తరుణ్ సుధీర్ చాలా బాధపడ్డాడు..తన క్లోజ్ ఫ్రెండ్ పెళ్లికి రాలేకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దర్శన్ ను ఎంతగా మిస్ అవుతున్నాడో తెలియపరిచాడు. నిజానికి ఈ ముహూర్తం దర్శన్ డేట్స్ అడ్జస్ట్ చేసి అరేంజ్ చేయడం జరిగిందట. ఆగస్టు 15 డేట్ ఇచ్చాను ఇక మార్చొద్దు అని దర్శన్ చెప్పాడట. అయితే తీరా తాను పెళ్లి పీటలు ఎక్కే సమయానికి దర్శనం రాలేకపోవడం అతనికి ఎంతో బాధ కలిగిస్తోంది అన్నాడు తరుణ్ సుధీర్.

ఆగస్టు 11న ఈ ఇద్దరి పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు మధ్య తరుణ్ భాస్కర్, సోనాల్ మెడలో మాంగల్యం కట్టాడు. అనంతరం సెప్టెంబర్ 2 మంగళవారం నాడు ఈ ఇద్దరు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మరొకసారి వివాహం చేసుకున్నారు.. సోనాల్ మతానికి గౌరవం ఇచ్చి ఇరు కుటుంబాల సమక్షంలో తరుణ్ ఆమెను క్రైస్తవ పద్ధతిలో మరొకసారి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫాన్స్ కూడా అతనికి అభినందనలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News