ఆ విమర్శ వెంకీ పాలిట ఛాలెంజ్!
వీటన్నింటికీ మించి వ్యక్తిగ తంగా ఆయన ఎలా ఉంటారు? అన్నది అందరికీ తెలిసిందే
విక్టరీ వెంకటేష్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. 75 సినిమాలు పూర్తి చేసిన సీనియర్ స్టార్ హీరో అతను. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడు. యాక్షన్..ఎమోషన్..సెంటిమెంట్ ఏదైనా సరే వెంకీ మార్క్ పెర్పార్మన్స్ పడాల్సిందే. అందుకే వెంకటేష్ అంటే అందరూ అభిమానించే గొప్ప స్టార్ అయ్యారు. ఆయన నటనలో పేరు పెట్టడానికి లేదు. అంత గొప్ప నటుడు. వీటన్నింటికీ మించి వ్యక్తిగ తంగా ఆయన ఎలా ఉంటారు? అన్నది అందరికీ తెలిసిందే. కామ్ గోయింగ్ పర్సనాల్టీ.
అందులోనూ ఈ మధ్య కాలంలో వెంకీ మరింత యాక్టివ్ గా ఉంటున్నారు. పబ్లిక్ లో ఎక్కువగా తిరుగుతు న్నారు. ఒకప్పుడు తెర మీద మాత్రమే కనిపించే వెంకీ ఇప్పుడు ప్రేక్షకుల మధ్యలోకి వచ్చి ఎంతో సరదాగా గడుపుతున్నారు. ఇటీవలే ఆయన ఓ రోడ్ పక్కన ఉన్న చిన్న టిఫిన్ షాప్ లో అందరితో పాటు కూర్చుని టిఫిన్ చేయడం ఆయనలో సింప్లిసీటి మరోసారి బయట పెట్టింది. దీంతో వెంకీ ఇంత సింపుల్ గా ఉంటా రా? అనిపించింది.
తాజాగా ఆయన నటించిన `సైంధవ్` సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సంద ర్భంగా ఆయన కెరీర్ లో ఎదుర్కున్న ఓ విమర్శ గురించి చెప్పుకొచ్చి..ఆ విమర్శతో తానెంత గ్రేట్ అనిపించుకున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం... ఓ సినిమా షూటింగ్ ఔట్ డోర్ లో జరుగు తోందిట. అప్పుడు ఎవరో తెలియని వ్యక్తి జనాల మధ్యలో నుంచి ఏడుపు నటించడం రాదు అన్నా రుట.
ఆ విమర్శని సీరియస్ గా తీసుకున్న వెంకటేష్ అప్పటికప్పుడే ఎమోషనల్ సీన్స్ ప్రాక్టీస్ చేయడం చేసారుట. ధర్మచక్రం సినిమా నుంచి ఎమోషన్ సన్నివేశాలు ఏవైనా కెమెరాక్లోజప్ లో పెట్టమని చెప్పేవారుట. అప్పటి నుంచి ఇప్పటివరకూ మళ్లీ ఎవరూ తనని ఎవరూ విమర్శించలేదని ఆనాటి విమర్శని గుర్తు చేసుకున్నారు. అలాగే నటన విషయంలో తనని ఏదో శక్తి ముందుక నడిపిస్తుందన్నారు. చాలా సందర్భాల్లో నటన అనేది యాక్సిడెంటల్ గానే జరిగిపోతుందని..దాని కోసం పెద్దగా వర్క్ చేయనన్నారు. అందుకు కారణం మంచి వాతావరణం..టీమ్ సహకారంతోనే అలా సాధ్యమవు తుందన్నారు.