ఈసారి ఆస్కార్ అవార్డ్ కి వివాదాస్పద చిత్రం
వివాదాస్పద చిత్రంగా నిలిచిన కేరళ స్టోరీ ని ఆస్కార్ నామినేషన్స్ కి అధికారికంగా పంపిస్తే మరింత వివాదం రేగే అవకాశాలు ఉన్నాయి.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కిన విషయం తెల్సిందే. దాంతో వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డు ల్లో కూడా ఇండియన్ సినిమా సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలు అయ్యాయి. కొన్ని సినిమాలను ఇండియా అధికారికంగా ఆస్కార్ కి నామినేట్ చేయబోతుంది.
ఇప్పటికే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ను ఆస్కార్ నామినేషన్స్ కి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా దర్శకుడు అట్లీ ప్రకటించాడు. ఇండియా తరపున ఆస్కార్ ఎంట్రీ లభించకుంటే సొంతంగానే ఆస్కార్ బరిలో నిలవాలని అట్లీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఇండియా తరపున అధికారికంగా ది కేరళ స్టోరీ సినిమాను ఆస్కార్ బరిలో నిలిపేందుకు గాను సిద్ధం అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. వివాదాస్పద చిత్రంగా నిలిచిన కేరళ స్టోరీ ని ఆస్కార్ నామినేషన్స్ కి అధికారికంగా పంపిస్తే మరింత వివాదం రేగే అవకాశాలు ఉన్నాయి.
అదా శర్మ కీలక పాత్రలో నటించిన కేరళ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెల్సిందే. వివాదం వల్ల సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. సినిమా లో రెండు మతాలకు సంబంధించిన విషయాలను చూపించడం జరిగింది. దాని వల్లే వివాదం మొదలైంది.