340 కోట్లు చూసిన దర్శకుడికి కోటి కూడా రాలే..
బాలీవుడ్ మీడియాలో రివ్యూలు అయితే గట్టిగానే వచ్చాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు కనీసం కోటి కి పైగా కలెక్షన్స్ అందుకోకపోవడం విశేషం.
ఎక్కడలేని అదృష్టాలు దురదృష్టాలు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలోనే హైలెట్ అవుతూ ఉంటాయి. ఒకప్పుడు వందల కోట్ల బాక్సాఫీస్ సక్సెస్ చూసినవారు కూడా ఇప్పుడు కనీసం అవకాశాలు కూడా అందుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఏదైనా సరే కంటెంట్ జనాలకు కనెక్ట్ అయితే మాత్రం ఒక్కసారిగా తలరాతలు మారిపోతాయి. లేదంటే మళ్లీ మరో అవకాశం అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.
పెట్టిన పెట్టుబడిలో సగం కూడా కొన్నిసార్లు వెనక్కి రాకపోవచ్చు. ఇప్పుడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని చూస్తే అదే అర్థమవుతుంది. అతను గత ఏడాది చాలా కాంట్రవర్సీల మధ్య వెండితెర పైకి తీసుకువచ్చిన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్. హిందు పండితులపై జరిగిన దాడులు నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
హిందూ సెంటిమెంట్ బాగా కలిసి రావడమే కాకుండా బిజెపి ప్రభుత్వం నుంచి కూడా పొలిటికల్ సపోర్ట్ గట్టిగానే లభించింది. ఏకంగా దర్శకుడికి నేషనల్ లెవల్లో సెక్యూరిటీ ఇచ్చారు అంటే సినిమా ఇంపాక్ట్ ఏ విధంగా చూపించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 15 కోట్ల పెట్టుబడికి ఊహించని రెట్టింపు లాభాలను అందించింది. ఏకంగా 340 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది.
అయితే అదే జోరులో దర్శకుడు ది వ్యాక్సిన్ వార్ అనే సినిమాను చాలా వేగంగా అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఇక ఈ సినిమాను ఈ వారం ప్రేక్షకుల ముందుకు తీసుకురాగ కనీస స్పందన రాకపోవడం విశేషం. బాలీవుడ్ మీడియాలో రివ్యూలు అయితే గట్టిగానే వచ్చాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు కనీసం కోటి కి పైగా కలెక్షన్స్ అందుకోకపోవడం విశేషం. నార్త్ సౌత్ లో ఎక్కడ కూడా థియేటర్స్ లో జనాలు పెద్దగా కనిపించలేదు.
అనుపమ్ ఖేర్, నానా పటేకర్ లాంటి బడా బాలీవుడ్ సీనియర్ నటులు ఉన్నప్పటికీ కనీసం ఓపెనింగ్స్ లో కూడా ఈ సినిమా బెస్ట్ అనిపించుకోలేకపోయింది. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ తో సక్సెస్ చూసిన తర్వాత దర్శకుడు ఆ తరువాత సినిమాకే మరీ ఈ స్థాయికి పడిపోవడం షాక్ అనే చెప్పాలి. పదికోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ గా పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చింది. నిర్మాతలు అయితే సేఫ్ అయ్యారు. కానీ థియేట్రికల్ గా మాత్రం సినిమా డిజాస్టర్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.