రూ.100 కోట్లు.. ఇది అసలైన సూపర్‌ హిట్‌ అంటే!

తెలుగు, తమిళ సినిమాలకు పోటీ అన్నట్లుగా మలయాళ సినిమాలు వందల కోట్ల వసూళ్లు రాబడుతూ పాన్ ఇండియా రేంజ్ లో కుమ్మేస్తున్నాయి.

Update: 2024-03-06 08:21 GMT

ఒకప్పుడు మలయాళ సినిమా పాతిక కోట్లు వసూళ్లు చేస్తే గొప్ప విషయం అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు మినిమం రూ.50 కోట్లు అన్నట్లుగా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దడదడలాడిస్తున్నాయి. తెలుగు, తమిళ సినిమాలకు పోటీ అన్నట్లుగా మలయాళ సినిమాలు వందల కోట్ల వసూళ్లు రాబడుతూ పాన్ ఇండియా రేంజ్ లో కుమ్మేస్తున్నాయి.

ఇటీవల విడుదల అయిన ప్రేమలు మరియు బ్రహ్మయుగం సినిమాలు మలయాళ బాక్సాఫీస్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు మంజుమ్మెల్‌ బాయ్స్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లు నమోదు చేసి సంచలనం సృష్టించింది.

ఈ ఏడాది మేటి చిత్రాల్లో నెం.1 గా మంజుమ్మెల్‌ బాయ్స్ సినిమా నిలిచింది. మలయాళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కేవలం రూ.14 నుంచి రూ.15 కోట్ల బడ్జెట్‌ తో రూపొందింది. థియేట్రికల్‌ రిలీజ్‌ తోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

త్వరలో తెలుగు తో పాటు మరికొన్ని భాషల్లో డబ్‌ అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇంకా రూ.50 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు చేసిన ఆశ్చర్యం లేదు అన్నట్లుగా మలయాళ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూడు వారాల్లో ఏకంగా వంద కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా అసలైన సూపర్ హిట్‌ అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

ఒక గుహ నేపథ్యంలో సాగే కథతో మంజుమ్మెల్‌ బాయ్స్ తెరకెక్కింది. చాలా నాచురల్‌ స్క్రీన్‌ ప్లే తో పాటు, అన్ని పాత్రలు కూడా మన పక్కింటి వారు లేదా మన వారు అన్నట్లుగా అనిపించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు తెగ ఫిదా అవుతున్నారు.

సినిమా చూస్తున్నంత సేపు కనెక్ట్‌ అయ్యి ఉండటం వల్ల మంచి మౌత్ టాక్ వచ్చింది. అందుకే ఈ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. తెలుగు లో త్వరలో విడుదల అవ్వబోతుంది. మరి ఇక్కడ మంజుమ్మెల్‌ బాయ్స్ కి ఎలాంటి ఫలితం దక్కబోతుంది అనేది చూడాలి. మరో వైపు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News