థగ్ లైఫ్.. కాంబో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా..?

ఇక నెక్స్ట్ షెడ్యూల్ ని రష్యా, సైనేరియాలో ప్లాన్ చేస్తున్నారట మణిరత్నం. థగ్ లైఫ్ సినిమా ఒక అద్భుతమైన కథతో వస్తుందని తెలుస్తుంది.

Update: 2024-01-31 08:55 GMT
థగ్ లైఫ్.. కాంబో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా..?
  • whatsapp icon

లోక నాయకుడు కమల్ హాసన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే వీరి కాంబినేషన్ లో ఆఫ్ లాంగ్ గ్యాప్ దాదాపు 37 ఏళ్ల తర్వాత ఒక ప్రెస్టీజియస్ సినిమా వస్తుంది. థగ్ లైఫ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో కమల్ తో త్రిష స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.

లేటెస్ట్ గా ఈ సినిమా మొదటి షెడ్యూల్ చెన్నైలో జరుగుతుందని తెలుస్తుంది. కమల్ హాసన్ తో పాటుగా జోజు జార్జ్, అభిరామి ఈ షెడ్యూల్ లో నటించారు. వారికి సంబంధించిన సీన్స్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ ని రష్యా, సైనేరియాలో ప్లాన్ చేస్తున్నారట మణిరత్నం. థగ్ లైఫ్ సినిమా ఒక అద్భుతమైన కథతో వస్తుందని తెలుస్తుంది.

ఈ సినిమాను కమల్ హాసన్ మణిరత్నం కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో కమల్ హాసన్ తో పాటుగా జయం రై, ఐశ్వర్య లక్ష్మీ, గౌతం కార్తీక్, దుల్కర్ సల్మాన్ లాంటి క్రేజీ స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతుంది.

కొన్ని కాంబినేషన్ సినిమాలు ఎప్పుడొచ్చినా వాటిపై విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కమల్, మణిరత్నం కలిసిఒ 37 ఏళ్ల తర్వాత చేస్తున్న ఈ థంగ్ లైఫ్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. విక్రం తో తిరిగి సూపర్ ఫాంలోకి వచ్చిన కమల్ హాసన్ ప్రతి సినిమాతో ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందించాలని ఫిక్స్ అయ్యాడు. తప్పకుండా థగ్ లైఫ్ నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. గత రెండేళ్లలో తన డ్రీం ప్రాజెక్ట్ పి.ఎస్ 1, 2 సినిమాలను తెరకెక్కించిన మణిరత్నం ఈసారి కమల్ తో నెక్స్ట్ లెవెల్ అటెంప్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. వీరి కాంబినేషన్ మీద ఆడియన్స్ లో ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా థగ్ లైఫ్ ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ పై అటు కమల్ ఫ్యాన్స్ ఇటు మణిరత్నం ఫ్యాన్స్ ఇద్దరు సూపర్ జోష్ లో ఉన్నారు.


Tags:    

Similar News