ప్రతిభ ఉన్నా ల‌క్ క‌లిసి రాక‌పోతే.. ఈ హీరోనే ఉదాహ‌ర‌ణ‌..!

ప్ర‌తిభ‌తో పాటు ల‌క్ క‌లిసి రావాలి. ఆ రెండిటిలో ఏదో ఒక‌టి ఉంటే స‌రిపోదు. ఇది ప‌క్కాగా ప్రూవ్ అయింది ఈ యువ‌హీరో విష‌యంలో.

Update: 2024-09-01 07:30 GMT

ప్ర‌తిభ‌తో పాటు ల‌క్ క‌లిసి రావాలి. ఆ రెండిటిలో ఏదో ఒక‌టి ఉంటే స‌రిపోదు. ఇది ప‌క్కాగా ప్రూవ్ అయింది ఈ యువ‌హీరో విష‌యంలో. అత‌డిలో ప్ర‌తిభ‌కు కొద‌వేమీ లేదు. ఇండియాలోనే అత్యుత్త‌మ యాక్ష‌న్ స్టార్స్ లో అత‌డు ఒక‌డు. హృతిక్ రోష‌న్ అంత‌టి వాడితో పోటీప‌డి న‌టించిన ప‌నిమంతుడు. గొప్ప డ్యాన్సింగ్ స్కిల్ ఉన్న స్టార్. కానీ ఏం లాభం? అత‌డికి ల‌క్ క‌లిసి రాలేదు. ఇటీవ‌ల సోలో హిట్టు ఒక్క‌టంటే ఒక్క‌టీ లేదు. వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కోవ‌డంతో ఇప్పుడు అత‌డికి మార్కెట్లో చిక్కులొచ్చి ప‌డ్డాయి. ఇప్ప‌టికే సంత‌కం చేసిన సినిమాలు అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతున్నాయి.

ఇంత‌లోనే అత‌డు న‌టిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఒక‌టి మ‌ధ్య‌లోనే ఆపేసారన్న వార్త విస్మ‌య‌ప‌రిచింది. ఇంత‌కీ ఎవ‌రా హీరో? అంటే నిస్సందేహంగా `టైగ‌ర్ ష్రాఫ్` గురించే ఇదంతా. అత‌డు న‌టించిన హీరో పంథి 2, గ‌ణ‌ప‌త్ 1, బ‌డే మియాన్ చోటే మియాన్ అతి పెద్ద డిజాస్ట‌ర్లుగా మార‌డంతో ప్ర‌స్తుతం సెట్లో ఉన్న హీరో నంబ‌ర్ -1 పై దీని ప్ర‌భావం ప‌డింద‌ని చెబుతున్నారు. ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న జ‌గ‌న్ శ‌క్తి ప్ర‌స్తుతానికి చిత్రీక‌ర‌ణ‌ను హోల్డ్ లో ఉంచి వేరొక ప్రాజెక్ట్ మేకింగ్ కోసం వెళ్లిపోయార‌ని టాక్ వినిపిస్తోంది. దీన‌ర్థం టైగ‌ర్ ష్రాఫ్ తో ముందుకు వెళ్ల‌డం ఇక వీలుప‌డ‌ద‌నే.

ఇటీవ‌ల ఫ్లాపుల కార‌ణంగా టైగ‌ర్ ష్రాఫ్ వ‌సూలు చేసే భారీ పారితోషికం, అత‌డి సేవ‌కుల‌కు వ‌స‌తులు ఇత‌ర‌త్రా బ‌ర్డెన్ అని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. దీంతో హీరో నంబ‌ర్ 1 సినిమాని మ‌ధ్య‌లోనే ఆపేసార‌ని గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఈద్ సెల‌వ‌ల్లోనే వ‌చ్చిన బ‌డే మియాన్ చోటే మియాన్ పెద్ద డిజాస్ట‌ర్ గా మార‌డంతో దాని ప్ర‌భావం హీరో నంబ‌ర్ వ‌న్ పై ప‌డింద‌ట‌.

బడే మియాన్ చోటే మియాన్ మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా వాషు భగ్నాని నేతృత్వంలోని పూజా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. కానీ 20 శాతం చిత్రీకరణ పూర్తయ్యాక ఆపేశార‌ని బాలీవుడ్ హంగామా త‌న క‌థ‌నంలో పేర్కొంది. బడే మియాన్ చోటే మియాన్ యొక్క బాక్స్ ఆఫీస్ సంఖ్యలు హీరో నం. 1 విడుదలపై ప్రభావం చూపాయ‌ని స‌ద‌రు క‌థ‌నం వెల్ల‌డించింది. పింక్‌విల్లాలోని ఒక క‌థ‌నం మేరకు... నిర్మాణ సంస్థ‌ భారీగా అప్పుల్లో ఉండ‌టంతో డబ్బు పెట్టే స్థితిలో లేరని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్లాన్ ప్ర‌కారం.. యూరప్‌లో అంతర్జాతీయ సెటప్ ఉంది. న‌టీన‌టులంతా సిద్ధ‌మ‌య్యారు. కానీ ఇంత‌లోనే ప్రాజెక్ట్ ని వాయిదా వేసార‌ని టాక్ వినిపించింది.

Tags:    

Similar News