ఆ యాక్షన్ ప్రాంచైజీ నుంచి పార్ట్-4!
బాలీవుడ్ 'భాఘీ' ప్రాంచైజీ గురించి చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్ ప్రాంచైజీ చిత్రాల్లో భాఘీ ఓ బ్రాండ్ గా ముద్ర వేసుకుంది
బాలీవుడ్ 'భాఘీ' ప్రాంచైజీ గురించి చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్ ప్రాంచైజీ చిత్రాల్లో భాఘీ ఓ బ్రాండ్ గా ముద్ర వేసుకుంది. 1990 నంచి 2016 వరకూ ఆ ప్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేసినవే. తొలి భాగంలో సల్మాన్ ఖాన్-నగ్మా జంటగా నటించగా దీపక్ శివదాసినీ దర్శకత్వం వహించారు. అటుపై 11 ఏళ్ల తర్వాత రెండవ భాగంలో సంజయ్ దత్-మనీషా కోయిరాలా జంటగా నటించగా ఆ సినిమాకి రాజేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు.
ఈ రెండు విజయాలు చూసి 2016 లో 'భాఘీ-3' ని శబ్బీర్ ఖాన్ తెరకెక్కించారు. ఇందులో టైగర్ ష్రాఫ్- శ్రద్దా కపూర్ జంటగా నటించారు. ఈ సినిమా విజయానికి టైగర్ ష్రాప్ బాడీ ట్రాన్స్ పర్మేషన్ కూడా ఓ కారణం. అందులో రోల్ కోసం టైగర్ ష్రాప్ ప్రత్యేకంగా సన్నద్దమయ్యాడు. ఇదే సినిమాలో అతడిని ఢీ కొట్టడానికి టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు విలన్ గా రంగంలోకి దిగాడు. అందుకోసం సుధీర్ బాబు కూడా సిక్స్ ప్యాక్ బాడీ తో అదరగొట్టాడు.
అలా 'భాగీ-3' సౌత్ లోనే బాగా పేమస్ అయింది. తాజాగా మళ్లీ పదేళ్ల తర్వాత 'భాఘీ-4' చిత్రాన్ని ప్రకటించారు. 'అతను తన కుటుంబం కోసం పోరాడాడు. ఒక దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేసాడు. బాఘీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాబోతుంది అంటూ 'భాఘీ-4'ని పరిచయం చేసారు. ఇందులో హీరో మాత్రం మారలేదు. 'భాఘీ-3' లో నటించిన టైగర్ ష్రాప్ యధావిధిగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు.
సాజిద్ నడివాయావాలా దీన్ని నిర్మిస్తున్నారు. అయితే దర్శకుడు వివరాలు మాత్రం రివీల్ చేయలేదు. కొత్త దర్శకుడుని తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే హీరోయిన్ కూడా కొత్త భామని తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ పనులు టైగర్ ష్రాప్- సాజిద్ నడియావాలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం రైటర్ల బృందం చే కథకి మెరుగులు దిద్దించే పనిలో ఉన్నారు.