కొత్త లవర్స్ తో పాత జోడీ…
తరువాత కరెక్ట్ చేసుకొని దిషా ధనుక్ పిక్స్ అతి కష్టం మీద సంపాదించాయి.
బాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ మధ్య ప్రేమకథలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరు ఎప్పుడు ఎవరితో రిలేషన్ లో ఉంటారో అర్ధం కాక మీడియా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది లివింగ్ రిలేషన్ అనేది బిటౌన్ లో సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఒకటి రెండు సినిమాలు కలిసి నటిస్తే తర్వాత మూడోసారి పబ్బులలో పార్టీలలో కలిసి కనిపిస్తూ ఉంటారు.
అలా ఉన్నారంటే వారిద్దరి మధ్య లివింగ్ రిలేషన్ ఉందని క్లారిటీ వచ్చేస్తుంది. బాలీవుడ్ లో మొన్నటివరకు బెస్ట్ కపుల్స్ గా కనిపించిన టైగర్ ష్రాఫ్, దిశా పటాని బ్రేక్ అప్ చెప్పుకొని విడిపోయారు. ఇద్దరు రిలేషన్ లో ఉన్నప్పుడు మేగ్జిమమ్ సినిమాలు అన్ని వారిద్దరూ జోడీగానే వచ్చాయి. అయితే ఏమైందో సడెన్ గా దిశా పటాని టైగర్ ష్రాఫ్ కి బ్రేక్ అప్ చెప్పేసింది.
ఈ విషయం ఇంకా బిటౌన్ లో మీడియాకి పూర్తిగా తెలియకముందే ఈ బ్యూటీ కొత్త బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. అలెగ్జాండర్ అలెక్సిలిక్ ని దిశాపటాని రీసెంట్ గా ఒక పార్టీలో తన స్నేహితులకు పరిచయం చేసింది. చెట్టాపట్టాలేసుకొని పార్టీలో తిరుగుతూ అతని సాహచర్యాన్ని ఆశ్వాదించింది. దీంతో దిశా పటాని కొత్త బాయ్ ఫ్రెండ్ ని సెట్ చేసుకుందనే విషయం తెరపైకి వచ్చింది.
ఇప్పుడు టైగర్ ష్రాఫ్ కూడా తన జోడీని సెలక్ట్ చేసుకున్నాడంట. ఆమె యాక్టర్ కాదని తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్ దిషా ధనుక్ తో ఏడాదిన్నర నుంచి రిలేషన్ లో ఉన్నారంట. వీరి రిలేషన్ ని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్లే ప్లాన్ లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ప్రొడక్షన్ హౌస్ లో దిషా ధనుక్ సీనియర్ హోదాలో ఉందంట. అలాగే టైగర్ ని కొత్త సినిమాల కోసం ఎక్కువగా ఆమె రికమండ్ చేస్తుందని తెలుస్తోంది.
ఆమె గురించి రాసే క్రమంలో కొన్ని మీడియా సంస్థలో మలయాళీ యాక్టర్ దృశ్యం ఫేమ్ ఎస్తర్ అనీల్ ఫోటోని పబ్లిష్ చేశాయి. తరువాత కరెక్ట్ చేసుకొని దిషా ధనుక్ పిక్స్ అతి కష్టం మీద సంపాదించాయి. ఈ బ్యూటీ కూడా హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో ఉండటం విశేషం. మొత్తానికి దిశా పటాని, టైగర్ ష్రాఫ్ బ్రేక్ అప్ తర్వాత టైం గ్యాప్ ఇవ్వకుండా కొత్త ప్రేమికులని సెట్ చేసుకున్నారంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం చేస్తోంది.