పక్కసీట్లో కూర్చుంటే చేతులేసి ఇబ్బంది పెట్టాడు!
బాలీవుడ్ నటి తిలోతమా షోమ్ సుపరిచితమే. ఇటీవేలే `సీఏ` వెబ్ సిరీస్తో ప్రేక్షకుల్నిఅలరించింది.
బాలీవుడ్ నటి తిలోతమా షోమ్ సుపరిచితమే. ఇటీవేలే `సీఏ` వెబ్ సిరీస్తో ప్రేక్షకుల్నిఅలరించింది. ఈసిరీస్ వివాదాస్పదం కావడంతో అమ్మడికి మరింత గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఈ సిరీస్ నె ప్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా తిలోతమ తనకెదురైన లైంగిక వేధింపుల గురించి తొలిసారి ఓపెన్ అయింది. `ఢిల్లీ లో బస్సు కోసం ఎదురుచూస్తున్నాను. అప్పుడే నా దగ్గరకు ఓ కారు వచ్చి ఆగింది.
దీంతో భయంతో కొద్ది దూరం వెళ్లాలనుకున్నా. కానీ నేను పరిగెత్తనా వాళ్లు పట్టుకుంటారని అర్దమైంది. దీంతో రోడ్ మధ్యలోకి వచ్చి లిప్ట్ అడిగాను. చాలాకార్లు వెళ్తున్నా ఎవరూ ఆపలేదు. కాసేపటికి మెడికల్ గుర్తు ఉన్న ఓకారు ఆపారు. దీంతో కారెక్కి ముందు సీట్లో కూర్చున్నా. కొద్ది దూరం ప్రయాణం అనంతనం డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి నా చేయి పట్టుకున్నాడు. ప్యాంట్ కూడా విప్పాడు. వికృతి చేష్టలకు పాల్పడే ప్రయత్నం చేసాడు.
దీంతో అతడిపై తిరగబడ్డాను. చేతితో దవడ మీద కొట్టాను. వెంటనే కారు ఆపాడు. మరో ఆలోచన లేకుండా కారు దిగేసాను. ఇది నా జీవితంలో ఎదురైన అత్యంత భయంకరమైన సంఘటన. అతడి కారు ఎక్కడానికి మరో కారణం ఉంది. మెడికల్ సింబల్ ఉండటంతో అతడు డాక్టర్ అనుకున్నా. అలాంటి వాళ్లతో ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించా. కానీ ఆ సింబల్ పేరుతో అతడు మోసాలకు పాల్పడే వాడని తర్వాత రోజుల్లో` తెలిసింది.
తెలియని వాళ్లను లిప్ట్ అడగడం ప్రమాదకరం. కానీ తప్పని పరిస్థితుల్లో ఎక్కాల్సివచ్చినప్పుడు మహిళలంతా తగు జాగ్రత్తలు తీసుకుని ఎక్కాలి. ఆకారులో ఒక్కడే ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. మరో ఇద్దరు, ముగ్గురు ఉంటే? ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. అలాగని లిప్ట్ ఇచ్చిన వారందర్నీతప్పు పట్టడం లేదు. సమాజంలో ఇలాంటి వారున్నారని చెబుతున్నాను` అంది.