ఇక మార్కెట్ లో మెగా జాత‌రే!

సినీ మార్కెట్లో మెగా జాత‌ర‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇక‌పై కంటున్యూగా మెగా జాత‌రే క‌నిపిస్తుంది.

Update: 2024-10-23 12:30 GMT

సినీ మార్కెట్లో మెగా జాత‌ర‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇక‌పై కంటున్యూగా మెగా జాత‌రే క‌నిపిస్తుంది. ఒక్కో మెగా హీరో వ‌రుస చిత్రాల‌తో అల‌రించ‌డానికి రెడీ అవుతున్నారు. న‌వంబ‌ర్ 14న మెగా ప్రిన్స్ వ‌రుణ తేజ్ న‌టించిన `మ‌ట్కా` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది. వ‌రుణ్ కెరీర్ లో రెండ‌వ పాన్ ఇండియా రిలీజ్ ఇది. అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. `మ‌ట్కా` అనే ఆట‌ను బేస్ చేసుకుని పాన్ ఇండియాకి క‌నెక్ట్ చేస్తున్నారు.

ప్రేక్ష‌కుల్ని ఓ కొత్త వ‌ర‌ల్డ్ లోకే మెగా ప్రిన్స్ తీసుకెళ్తాడ‌ని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. కొంత‌కాలంగా వ‌రుణ్ కి స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు. దీంతో ఈ సినిమాపై అత‌డు చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఇది రిలీజ్ అయిన అనంత‌రం గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ తో సంక్రాంతి పండ‌గ బ‌రిలో నిలిచారు. ఆ సినిమా జ‌న‌వ‌రి 10న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి డిసెంబ‌ర్ లో రిలీజ్ అవ్వాలి.

కానీ అదే నెల‌లో `పుష్ప‌-2` పాన్ ఇండియా రిలీజ్ ఉండ‌టంతో జ‌న‌వ‌రికి తోసారు. ఆ కార‌ణంగా చిరంజీవి `విశ్వంభ‌ర` కూడా వాయిదా ప‌డింది ఈ సినిమానే తొలుత పండ‌క్కి రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ షూటింగ్ డిలే అవ్వ‌డంతో పాటు సాంకేతిక ప‌నులకు మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌డంతో? `విశ్వంభ‌ర టార్గెట్ స‌మ్మ‌ర్ అయింది. ఈ మూడ రిలీజ్ ల అనంత‌రం ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్ రిలీజ్ రేసులో ఉంటారు.

అత‌డు న‌టిస్తోన్న `ఓజీ`, `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` చిత్రాలు వ‌చ్చే ఏడాది ఏప్రిల్ త‌ర్వాత ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం పీకే ఈ రెండు సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్ప‌టికే షూటింగ్ బాగా ఆల‌స్య‌మ‌వ్వ‌డంతో ఇక డిలే లేదంటూ సెట్స్ కి హాజ‌ర‌వుతున్నారు. అలా న‌వంబ‌ర్ నుంచి వ‌చ్చే ఏడాది మిడ్ వ‌ర‌కూ మార్కెట్ లో మెగా జాత‌ర క‌నిపిస్తుంది.

Tags:    

Similar News