ఇక్క‌డ మోక్షజ్ఞ‌.. అక్క‌డ ఆర్య‌న్ ఖాన్?

ప‌రిశ్ర‌మ అగ్ర కుటుంబాల నుంచి వ‌స్తున్న హీరోలుగా ఆ ఇద్ద‌రిపైనా భారీ అంచ‌నాలు ఉన్నాయి. దానికి త‌గ్గ‌ట్టే యువ‌హీరోల లాంచింగ్ ఘ‌నంగా ఉంటుంద‌ని కూడా భావిస్తున్నారు.

Update: 2024-09-05 06:17 GMT

అవును.. ఇక్క‌డ నంద‌మూరి మోక్షజ్ఞ .. అక్క‌డ ఆర్య‌న్ ఖాన్ .. ఒకే త‌ర‌హా. ఈ ఇద్ద‌రి డెబ్యూ సినిమాల‌ గురించి అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూస్తున్నారు. ప‌రిశ్ర‌మ అగ్ర కుటుంబాల నుంచి వ‌స్తున్న హీరోలుగా ఆ ఇద్ద‌రిపైనా భారీ అంచ‌నాలు ఉన్నాయి. దానికి త‌గ్గ‌ట్టే యువ‌హీరోల లాంచింగ్ ఘ‌నంగా ఉంటుంద‌ని కూడా భావిస్తున్నారు.

అయితే ఈ ఇద్ద‌రి లాంచింగ్ గురించిన‌ స‌స్పెన్స్ ఇంత‌కాలం కొన‌సాగినా ఇప్పుడు నెమ్మ‌దిగా వీడుతోంది. టాలీవుడ్ అగ్ర హీరో బాల‌కృష్ణ కుమారుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమా లాంచింగ్ కార్య‌క్ర‌మం ఈ శుక్ర‌వారం వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. కానీ ఈ ఆరంభం గురించి అభిమానులు చాలా కాలంగా వేచి చూడాల్సి వ‌చ్చింది. నాలుగైదేళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత అత‌డి డెబ్యూ ఇప్ప‌టికి కుదిరింది. మోక్షుతో పోలిస్తే ఆర్య‌న్ ఖాన్ సినీరంగ ప్ర‌వేశంపై కొంత‌ స్ప‌ష్ఠ‌త ఉంది. ఆరంభం అత‌డు దర్శ‌కుడిగా రాణించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాడు. ఆ త‌ర్వాత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి హీరోగా లాంచ్ అయ్యే అవ‌కాశం ఉంది. క్రియేట‌ర్ గా కెమెరా వెన‌క నిరూపించుకున్న త‌ర్వాతే ఆర్య‌న్ హీరో అవుతాడ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికి హీరో అవుతాన‌ని ఆర్య‌న్ ఎప్పుడూ చెప్ప‌లేదు.

ఇక నంద‌మూరి కుటుంబం నుంచి మోక్ష‌జ్ఞ హీరోగా ప్ర‌శాంత వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ప్రారంభ‌మ‌వుతోంది. ఈ చిత్రంలో బాల‌కృష్ణ అతిథి పాత్ర‌లో న‌టిస్తార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో అటు బాలీవుడ్ లోను కింగ్ ఖాన్ షారూఖ్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ న‌టుడిగా ఆరంగేట్రం చేసేందుకు వీలుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. అత‌డి కోసం రేసులో ప‌లువురు ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కులు ఉన్నారు. క‌ర‌ణ్ జోహార్ - ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్, ఆదిత్య చోప్రా- య‌ష్ రాజ్ ఫిలింస్, ఫ‌రా ఖాన్ వంటి పాపుల‌ర్ ద‌ర్శ‌క నిర్మాత‌లు సంసిద్ధంగా ఉన్నారు.

ఖాన్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ కోస‌మే వీరంతా వెయిటింగ్. కానీ ఆర్య‌న్ దృష్టి ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌త్వంపైనే ఉంది. అత‌డు తొలి ప్ర‌య‌త్నంగా స్టార్ డ‌మ్ అనే సినిమాని రూపొందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. కొంత స‌మ‌యం ప‌ట్టొచ్చేమో కానీ ఆర్య‌న్ హీరోగా ఆరంగేట్రం చేయ‌డం ఖాయ‌మ‌ని కూడా అభిమానులు భావిస్తున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ లెగ‌సీని న‌డిపించే హీరోగా మోక్ష‌జ్ఞ రాణించాల్సి ఉంది. అలాగే షారూఖ్ లెగ‌సీని ముందుకు తీసుకెళ్లే వార‌సుడిగా ఆర్య‌న్ ఖాన్ స‌త్తా చాటాల్సి ఉంది. ఇక ఆర్య‌న్ తో పాటు అత‌డి సోద‌రి సుహానా ఖాన్ కూడా న‌టిగా రాణించేందుకు ప్ర‌య‌త్నాల్లో ఉంది. సుహానా తండ్రి బాట‌లోనే బాలీవుడ్ లో ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలుస్తుంద‌ని కూడా అంచ‌నాలున్నాయి.

Tags:    

Similar News